WhatsApp Channel: వాట్సాప్‌ ఛానెల్‌కు 50 లక్షల మంది ఫాలోవర్లు.. ప్రత్యేక మెసేజ్‌ పోస్ట్‌ చేసిన ప్రధాని మోదీ

పెద్దఎత్తున ఫాలోవర్లతో ట్విటర్‌, ఫేస్‌బుక్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో చురుగ్గా ఉంటారనే సంగతి తెలిసిందే. తాజాగా ఆయన వాట్సాప్‌ ఛానెల్‌లోనూ తన హవా కొనసాగిస్తున్నారు.

Updated : 25 Sep 2023 17:20 IST

దిల్లీ: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇటీవలే ఛానెల్‌ (WhatsApp Channel) పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. రాజకీయనాయకుల నుంచి సెలబ్రిటీల వరకు, వ్యాపార సంస్థల నుంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్‌ వరకు ప్రతి ఒక్కరు తమకు సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్‌తో ఛానెల్‌ ద్వారా షేర్‌ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ పరిచయం చేసిన కొద్ది రోజుల్లోనే దీన్ని ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రధాని మోదీ (PM Modi) కూడా ఇటీవలే వాట్సాప్‌ ఛానెల్‌లో ఖాతాను ప్రారంభించారు. కొద్దిరోజుల్లోనే ఆయన్ను 50 లక్షల మంది అనుసరించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు.   

‘‘వాట్సాప్‌ ఛానెల్‌తో మీరంతా నాతో అనుసంధానమైనందుకు ఎంతో గొప్పగా భావిస్తున్నాను. నిరంతరం మీరు అందిస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు. ఈ మాధ్యమం ద్వారా మన సంభాషణలు కొనసాగిస్తుందన్నందుకు ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని అంశాల గురించి మనం మాట్లాడుకుందాం’’ అని ప్రధాని మోదీ వాట్సాప్‌ ఛానెల్‌లో మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. మరోవైపు పలువురు సెలబ్రిటీలు సైతం వాట్సాప్‌ ఛానెల్‌లో ఖాతాలను ప్రారంభించారు. బాలీవుడ్ నటి కత్రినా కైఫ్‌ను 1.3 కోట్ల మంది అనుసరిస్తుండగా, 60 లక్షల మంది ఫాలోవర్లతో అక్షయ్‌ కుమార్ రెండో స్థానంలో ఉన్నారు. ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ను 80 లక్షల మంది, స్టార్స్‌ స్పోర్ట్స్‌ను 50 లక్షల మంది అనుసరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని