SpiceJet: నిర్వహణలో ఉన్న స్పైస్‌జెట్‌ విమానం ఇంజిన్‌లో మంటలు

విమానాశ్రయంలో నిర్వహణలో ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో మంటలు చెలరేగాయి.

Updated : 26 Jul 2023 00:30 IST

దిల్లీ: నిలిపి ఉంచిన స్పైస్‌జెట్‌ విమానంలో మంటలు చెలరేగాయి. దిల్లీ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో నిర్వహణలో ఉన్న స్పైస్‌జెట్‌ క్యూ400 విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో మెయింటెనెన్స్‌లో ఉన్న ఇంజినీర్లు గుర్తించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించారు. వారు వచ్చి మంటలు అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్పైస్‌జెట్‌ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటనపై ఏవియేషన్‌ రెగ్యూలేటర్‌ డీజీసీఏ విచారణ చేపట్టింది. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని