Pegasus: పార్లమెంటరీ ప్యానెల్ ముందుకు ‘పెగాసస్’

‘పెగాసస్’ స్పైవేర్ సహాయంతో దేశంలో వందల మంది ప్రముఖల ఫోన్లు హ్యాకింగ్ గురయ్యానే కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దాంతో ఈ అంశం కాంగ్రెస్‌ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(ఐటీ) ముందుకు వెళ్లింది. దీనిపై ప్యానెల్ జులై 28న చర్చించనుంది.

Published : 21 Jul 2021 14:02 IST

దిల్లీ:‘పెగాసస్’ స్పైవేర్ సహాయంతో దేశంలో వందల మంది ప్రముఖల ఫోన్లు హ్యాకింగ్ గురయ్యానే కథనాలు సంచలనం సృష్టిస్తున్నాయి. దీనిపై పార్లమెంట్ దద్దరిల్లుతోంది. దాంతో ఈ అంశం కాంగ్రెస్‌ నేత శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ(ఐటీ) ముందుకు వెళ్లింది. దీనిపై ప్యానెల్ జులై 28న చర్చించనుంది.

‘దేశ పౌరుల భద్రత, గోప్యత గురించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ విచారించనుంది. దానిలో బాగంగా ఐటీ, కమ్యూనికేషన్ శాఖ, హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధులకు సమన్లు జారీచేసి, చర్చించనున్నాం’ అని కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2019లో కూడా ఈ పెగాసస్ అంశం ప్యానెల్ ముందుకు వచ్చింది. వాట్సాప్‌ ద్వారా కొన్ని అజ్ఞాత సందేశాలు వచ్చాయని, వాటితో తమ ఫోన్లలోకి పెగాసస్‌ను జొప్పించారని ఆ సమయంలో కొందరు జర్నలిస్టులు, హక్కుల కార్యకర్తలు ఆరోపించారు. తాజా హ్యాకింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, మాజీ సీఈసీ అశోక్ లావాసా ఫోన్ నంబర్లు ఉన్నట్లు ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం వెల్లడించింది. మొత్తం 300 మంది భారతీయలు ఉన్నట్లు ప్రచురించింది.

రెండు రోజుల క్రితం ప్రారంభమైన పార్లమెంట్ వర్షకాల సమావేశాల్లో ఈ అంశంపై విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. హ్యాకింగ్ నివేదికలు విడుదల చేస్తోన్న సంస్థలు కూడా ప్రభుత్వానికి సంబంధం ఉన్నట్లు ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని