మలయాళ సినిమా సత్తా చాటింది: వెంకటేశ్‌

ఆస్కార్‌ పురస్కారానికి అర్హత సాధించడంతో మలయాళం సినిమా ఇండస్ట్రీ తన సత్తా చాటిందని టాలీవుడ్‌ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. ఆ చిత్ర బృందం మొత్తానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. మలయాళీ చిత్రం జల్లికట్టు ‘ఆస్కార్‌’కు అర్హత సాధించిన సందర్భంగా వెంకటేశ్‌ ట్విటర్‌

Published : 26 Nov 2020 20:14 IST

హైదరాబాద్‌: ఆస్కార్‌ పురస్కారానికి అర్హత సాధించడంతో మలయాళ సినీ పరిశ్రమ తన సత్తా చాటిందని టాలీవుడ్‌ అగ్రహీరో విక్టరీ వెంకటేశ్‌ అన్నారు. ఆ చిత్ర బృందం మొత్తానికి ఆయన శుభాకాంక్షలు చెప్పారు. మలయాళీ చిత్రం జల్లికట్టు ‘ఆస్కార్‌’కు అర్హత సాధించిన సందర్భంగా వెంకటేశ్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. ‘జల్లికట్టు’కు లిజో జోసి పెల్లిస్సెరీ దర్శకత్వం వహించారు. ‘ఆస్కార్‌’ కోసం పోటీపడ్డ శకుంతలా దేవీ, గుంజన్‌ సక్సేనా, ఛపాక్‌, గులాబో సితాబో, చెక్‌పోస్ట్‌, స్కై ఈజ్‌ పింక్‌ ఇలా మొత్తం 27 ఉత్తమ చిత్రాలను పరిశీలించిన ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ‘జల్లికట్టు’ను ఎంపిక చేసింది. ఈసారి ఆస్కార్‌ రేసులో ఈ సినిమా నిలిచినట్లు ప్రకటించింది.
ఇదిలా ఉండగా.. ఇటీవల మల్టీస్టారర్‌ చిత్రాలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నారు వెంకీమామ. ప్రస్తుతం నారప్ప చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత వరుణ్‌తేజ్‌తో కలిసి ‘ఎఫ్‌3’లో నటించనున్నారు. గతేడాది సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్‌2’ మంచి విజయం సాధించింది. ఇటీవల ప్రకటించిన ఇండియన్‌ పనోరమ అవార్డు సొంతం చేసుకున్న ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. దీంతో దానికి సీక్వల్‌గా ‘ఎఫ్‌3’ని తెరకెక్కించాలని దర్శకుడు అనిల్‌ రావిపూడి ప్లాన్‌ చేస్తున్నారు. దీంతో పాటు వెంకటేశ్‌, రానా కాంబినేషన్‌లో మరో మరోసినిమా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కథను ఫైనల్‌ చేశామని, త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని స్వయంగా రానా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇవి చదవండి..

ఆస్కార్‌కు ‘జల్లికట్టు’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని