Haseen Dillruba Review: హసీన్ దిల్రుబా రివ్యూ
తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన మర్డర్ మిస్టరీ ‘హసీన్ దిల్రూబా’ నెట్ఫ్లిక్స్లోవిడుదలైంది. ఆ చిత్రం పై సమీక్ష.
చిత్రం: హసీన్ దిల్రుబా; నటీనటులు: తాప్సీ, విక్రంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే తదితరులు; సంగీతం: అమిత్ త్రివేది; సినిమాటోగ్రఫీ: జయ కృష్ణ గుమ్మడి; ఎడిటింగ్: శ్వేతా వెంకట్ మాథ్యూ; నిర్మాతలు: ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షూ శర్మ, భూషన్ కుమార్, క్రిషన్ కుమార్; రచన: కనిక దిల్లోన్; దర్శకత్వం: వినిల్ మాథ్యూ; విడుదల: నెట్‌ఫ్లిక్స్.
కథను సిద్ధం చేసుకోవడమే దర్శకుడి పని. ఆ కథకు సరిపోయే పాత్రలను దానికదే ఎంచుకుంటుందనేది ఫిలిం మేకర్స్ తరచూ చెప్పే మాట. ‘హసీన్ దిల్రుబా’ సినిమా కూడా బాలీవుడ్ నాయిక తాప్సీని అలా వరించిందే. పలువురు హీరోయిన్లు వద్దని తిరస్కరిస్తే చివరకు ఆమెను చేరిందా కథ. రచయిత కనిక దిల్లోన్ కథ వివరించినప్పుడు ఇలాంటి మర్డర్ మిస్టరీని మిగతా హీరోయిన్లు ఎలా తిరస్కరించారోనని అభిప్రాయం వ్యక్తం చేసిందామె. తాప్సీ సినిమాల్లోకి వచ్చి నేటికి(జులై 2) సరిగ్గా పదకొండేళ్లు. 11 ఏళ్ల క్రితం ఇదే రోజున ‘ఝుమ్మంది నాదం’తో నటిగా అరంగేట్రం చేసింది. ఇన్నేళ్ల తన కెరీర్లో మరపురాని పాత్రలెన్నో చేసింది. ఆమె బలంగా నమ్మి తీసిన ‘పింక్’, ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’, ‘థప్పడ్’తో పాటు పలు చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. తీసే ప్రతి సినిమాలోనూ మహిళల సమస్యలను ప్రస్తావిస్తుంది. కమర్షియల్గానూ మంచి విజయాలు సాధించాయి. మరి ఈ సారి తాప్సీ నమ్మకం నిజమైందా? ‘హసీన్ దిల్రుబా’ ప్రేక్షకులను రక్తికట్టించిందా? లేదా? అనేది తెలుసుకోవాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రాన్ని వెంటనే చూడాల్సిందే.
కథేంటంటే: రాణి కశ్యప్(తాప్సీ) దిల్లీకి చెందిన యువతి. నవలలు బాగా చదువుతుంది. ముఖ్యంగా దినేశ్ పండిట్ క్రైమ్ నవలలంటే ఎక్కువ ఇష్టం. జీవితం కూడా పుస్తకాల్లోలాగే రొమాంటిక్‌గా ఉండాలని కోరుకుంటుందామె. అలాంటి రాణికి జ్వాలాపుర్ అనే చిన్న టౌన్లో ఇంజనీర్‌గా పనిచేసే రిషు(విక్రాంత్)తో పెళ్లవుతుంది. అతనిది మెతకగా ఉండే మనస్తత్వం. రిషుకు పూర్తి భిన్నమైన మనస్తత్వం రాణిది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలొచ్చి దూరం పెరుగుతుంది. అలాంటి సమయంలోనే వీరి జీవితంలోకి నీల్ త్రిపాఠి(హర్షవర్ధన్ రాణే) వస్తాడు. అందగాడు, స్టైలిష్‌గా ఉంటాడు. పైగా రాణి చదివే నవలల్లో ఉండే గుణాలు.. కనిపించేసరికి అతడికి ఆకర్షితురాలవుతుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. కొన్నాళ్లకు ఆమెను వదిలేసి నీల్ దిల్లీకి వెళ్లిపోతాడు. వీళ్లిద్దరి మధ్య ఉండే సంబంధం జ్వాలాపుర్లో అందరికి తెలిసిపోతుంది. దీంతో మెతకగా ఉండే రిషు రగిలిపోతుంటాడు. ఒకరోజు అతడి ఇంట్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో రిషు చేయి తప్ప మిగతా ఆధారాలేవీ దొరకవు. నీల్ కూడా కనిపించకుండా పోతాడు. పోలీసు విచారణ మొదలవుతుంది. ప్రియుడితో పన్నాగం పన్ని భర్తను చంపిందనే ఆరోపణలను రాణి ఎదుర్కొంటుంది. మరి ఈ విచారణలో తేలిందేంటి? రిషును చంపిందెవరు? ఇంతకీ నీల్ ఏమైపోయాడు? ఆ హత్య ఎవరు చేశారు?
ఎలా ఉందంటే: సినిమా అంతా మొదటి నుంచే నాన్ లీనియర్ స్ర్కీన్‌ప్లేలో సాగుతుంది. కేసు విచారణతో పాటు, ఫ్లాష్‌బ్యాక్ ఇలా రెండు కథలు సమాంతరంగా నడుస్తాయి. రిషు, రాణి పెళ్లి తర్వాత సన్నివేశాలతో ఫ్లాష్‌బ్యాక్ మొదలవుతుంది. అయితే అవి చాలా వరకూ సాగదీసినట్లుగా ఉన్నాయి. రిషుతో పెళ్లి తర్వాత వచ్చే సన్నివేశాలు, నీలూతో ప్రేమ వ్యవహారం లాంటి ఘటనలతో తొలి అర్ధభాగం సాదాసీదాగా ఉంటుంది. ఆయా సన్నివేశాలను మరింత బలంగా రాసుకోవాల్సింది. కొన్ని చోట్ల మరీ సాగదీసినట్లుగా అనిపిస్తాయి.
నీల్ ప్రేమ వ్యవహారం అందరికీ తెలిశాక కథలో వేగం పెరుగుతుంది. ఈ విషయం తెలుసుకున్నాక రిషులో వచ్చే మార్పులేంటి? భర్త, సమాజం నుంచి రాణికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొందనే సన్నివేశాలతో రెండో అర్ధభాగం కొంత ఆసక్తికరంగా మొదలవుతుంది. ద్వితీయార్ధంలో విచారణ వేగవంతం కావడంతో ఆ సన్నివేశాలు రక్తికట్టిస్తాయి. ఆ తర్వాత మెలమెల్లగా సస్పెన్స్ తెలిసేకొద్దీ సినిమా ఆసక్తికరంగా మారుతుంది. క్లైమాక్స్‌కు వచ్చే సరికి కథనం మరింత ఉత్కంఠగా సాగుతుంది. చివరి 30 నిమిషాలు ప్రేక్షకుడిని అలరించేలా దర్శకుడు తీర్చిదిద్దాడు. ఇక రిషు, నీల్ ఒకరితో ఒకరు పోటీపడే తీరు సినిమాలో సస్పెన్స్ పెంచేందుకు తోడ్పడింది. ఫస్టాఫ్ కాస్త నిరూత్సాహపరిచినట్లు అనిపించినా సెకండ్ హాఫ్ ఆ లోటును భర్తీ చేసింది.
ఎవరెలా చేశారంటే: టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్న నటులు తాప్సీ, హర్షవర్ధన్ రాణే, విక్రాంత్ మాస్సే. తాప్సీ ఇప్పటికే తన ప్రతిభేంటో గత చిత్రాలతో నిరూపించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు చేయడం తనకు కొత్తేమీ కాదు. ‘పింక్’, ‘బేబీ’ ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో ఎంతో కొంత సస్పెన్స్ ఉండే ఉంటుంది. హసీన్ దిల్రుబాలో ఇదివరకు చేయని పాత్రలో బోల్డ్‌గా కనిపించింది. కానీ, ఆ సన్నివేశాలు తాప్సీకి పెద్దగా నప్పలేదు. మిగతా సన్నివేశాల్లో ఎప్పట్లాగే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విక్రాంత్ మాస్సే గురించి. ఈ యువ నటుడికి తాప్సీ కన్నా ఎక్కువ మార్కులు వేయొచ్చు. మొదటి నుంచి చివరి దాకా తన నటనతో కట్టిపడేశాడు. భార్యను మెప్పించలేని ఓ సాధారణ భర్తగా, సమాజం నుంచి వచ్చే సూటిపోటి మాటలు భరించే వాడిగా సహజంగా నటించాడు. హర్షవర్ధన్ రాణే పాత్ర పరిధి మేర బాగానే నటించాడు. అతడి ప్రతిభను మరింత విస్తృతంగా వినియోగించుకోవాల్సింది. అభిజిత్‌గా ‘సీఐడీ’ సీరియల్‌తో సుపరిచితుడైన ఆదిత్య శ్రీవాత్సవ ఇందులో పోలీసాఫీసర్‌గా నటించడం బాగుంది.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అమిత్ త్రివేది సంగీతంలో వచ్చిన మెలోడియస్ సాంగ్స్ వినసొంపుగా ఉంటాయి. ఇలాంటి మిస్టరీ డ్రామాలను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మరోమెట్టు ఎక్కిస్తుంది. అయితే, ఆ స్థాయి సంగీతం ఇవ్వలేకపోయాడు అమిత్. పాటలతో కొంత మేర ఆకట్టుకున్నాడు. నిర్మాణ విలువల్లో ఎలాంటి లోటు కనిపించలేదు. ఎడిటింగ్ విషయంలో తొలి అర్ధభాగంపై మరింత దృష్టి పెట్టాల్సింది. ‘హసీతో ఫసీ’లాంటి రొమాంటిక్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు వినిల్ మాథ్యూ ఈ మర్డర్ మిస్టరీను ఆకట్టుకునేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించాడు. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.
బలాలు | బలహీనతలు |
+ ద్వితీయార్ధం | - ప్రథమార్ధం |
+ విక్రాంత్ మాస్సే, తాప్సీల నటన | - నెమ్మదిగా సాగే కథనం |
+ సాంకేతిక బృందం పనితీరు |
చివరిగా: హసీన్ దిల్రుబా థ్రిల్లింగ్ మర్డర్ మిస్టరీ
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్ మెప్పించిందా? -
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
విద్యుత్ జమ్వాల్ నటించిన స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘క్రాక్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
Rathnam movie review: విశాల్ కథానాయకుడిగా హరి దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
అభినవ్ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం.. -
రివ్యూ: సైరెన్.. జయం రవి, కీర్తి సురేశ్ యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్’ మూవీ తెలుగులో మెప్పించిందా? -
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
Paarijatha Parvam Review; చైతన్యరావు, సునీల్, శ్రద్ధాదాస్ కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా? -
రివ్యూ: ఆట్టం.. మలయాళ సస్పెన్స్ డ్రామా ఎలా ఉంది?
వినయ్, కళాభవన్ షాజాన్, జరీన్ షిహబ్ కీలక పాత్రల్లో నటించిన ‘ఆట్టం’ ఎలా ఉంది? -
రివ్యూ: డియర్.. భార్య గురకపెట్టే కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీ మెప్పించిందా?
DeAr Movie 2024 Review: జీవీ ప్రకాష్‌కుమార్, ఐశ్వర్య రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ‘డియర్’ మూవీ మెప్పించిందా? -
రివ్యూ: శ్రీ రంగనీతులు.. సుహాస్, కార్తీక్ రత్నంల కొత్త మూవీ మెప్పించిందా?
sri ranga neethulu review: తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘శ్రీరంగ నీతులు’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: బడే మియా ఛోటే మియా.. అక్షయ్, టైగర్ ష్రాఫ్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో అక్షయ్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన ‘బడే మియా ఛోటే మియా’ మెప్పించిందా? -
రివ్యూ: గీతాంజలి మళ్ళీ వచ్చింది.. హారర్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
అంజలి కీలక పాత్రలో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: లవ్‌గురు.. విజయ్ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?
Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా? -
రివ్యూ: మైదాన్.. అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన స్పోర్ట్స్ డ్రామా మెప్పించిందా?
భారత ఫుట్‌బాల్ కోచ్ అబ్దుల్ సయ్యద్ రహీం జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ‘మైదాన్’ మూవీ ఎలా ఉంది? -
రివ్యూ: ప్రాజెక్ట్-Z.. సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్-Z’ ప్రేక్షకులను మెప్పించిందా? -
రివ్యూ: మంజుమ్మల్ బాయ్స్.. మలయాళ సూపర్‌హిట్ తెలుగులో ఎలా ఉంది?
మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించిన ‘మంజుమ్మల్ బాయ్స్’ మూవీ తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా? -
రివ్యూ: ఫ్యామిలీస్టార్.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడిందా?
Family Star Review: విజయ్ దేవరకొండ, మృణాళ్ ఠాకూర్ కీలక పాత్రల్లో నటించిన ‘ఫ్యామిలీస్టార్’ ఎలా ఉందంటే? -
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
Tillu Square Review: సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వర్ జంటగా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ మెప్పించిందా? -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే?
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్‌సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్‌లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్‌లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్