12th Fail: ఓటీటీలోకి ‘12th ఫెయిల్‌’ తెలుగు వెర్షన్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

దేశవ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకున్న ‘12th ఫెయిల్‌’ చిత్రం తెలుగు వెర్షన్‌ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. 

Published : 05 Mar 2024 12:28 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విధు వినోద్‌ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్‌ మస్సే ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘12th ఫెయిల్‌’ (12th Fail). విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెలుగు ప్రేక్షకులు ఎదురుచూశారు. వారి ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ తాజాగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌ అందుబాటులోకి వచ్చింది. డిస్నీ+హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) వేదికగా ఇది స్ట్రీమింగ్‌ అవుతోంది. నిన్నటి వరకు కేవలం హిందీలోనే అందుబాటులో ఉన్న ఈచిత్రం.. ఇప్పుడు తమిళ, తెలుగు భాషల్లోనూ ప్రసారమవుతోంది. దీంతో సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మిస్‌ ఇండియా చిందేస్తే.. పొట్లాం కట్టిన బిర్యానీలా పూజా.. నెరవేరిన రష్మిక కల..

‘12th ఫెయిల్‌’ చిన్న సినిమాగా విడుదలై సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకొని ఎన్నో రికార్డులను సాధించింది. ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌ (ఐఎమ్‌డీబీ)  టాప్‌ 250 ఉత్తమ చిత్రాల జాబితాలో 50వ స్థానాన్ని కైవసం చేసుకున్న ఏకైక భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించింది. హాలీవుడ్ చిత్రాలను వెనక్కినెట్టి 9.2 రేటింగ్‌ సాధించింది. ఆస్కార్‌ బరిలో నిలిచేందుకు పోటీపడనుంది. జనరల్‌ కేటగిరిలో ఇండిపెండెంట్‌గా చిత్రబృందం నామినేషన్‌ వేసింది. ఈచిత్రం నేపథ్యం విషయానికొస్తే.. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా రూపొందింది. 12వ తరగతి ఫెయిల్‌ అయిన యువకుడు.. ఐపీఎస్‌ ఎలా అయ్యాడనే ఆసక్తికర కథతో తీర్చిదిద్దారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని