‘ఆదిపురుష్‌’: ఆయన నటించడం లేదు..!

బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ నేతృత్వంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా ‘ఆది పురుష్‌’. భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. అలాగే అత్యంత కీలకమైన రావణుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు చిత్రబృందం...

Published : 25 Oct 2020 02:06 IST

క్లారిటీ వచ్చేసింది

ముంబయి‌: బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ నేతృత్వంలో ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటించనున్న సినిమా ‘ఆది పురుష్‌’. భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడి పాత్రలో కనిపించనున్నారు. రావణుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. అయితే మరో బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ ‘ఆదిపురుష్‌’ చిత్రంలో శివుడిగా కనిపించనున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై ఇప్పటికే చిత్రబృందం అజయ్‌ని సంప్రదించినట్లు.. ఆయన కూడా సినిమాలో నటించేందుకు ఆసక్తి కనబరచినట్లు వార్తలు వచ్చాయి.

కాగా, తాజాగా ఈ వార్తలపై అజయ్‌ దేవ్‌గణ్‌ టీం స్పందించింది. ఇది అవాస్తమని తేల్చి చెప్పింది . ‘ఆదిపురుష్‌’లో పాత్ర గురించి ఇప్పటివరకూ ఎవరూ అజయ్‌ని కలవలేదని స్పష్టం చేసింది. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాలకు బ్రేక్‌ పడుతుందని అజయ్‌ టీం ఆశాభావం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ సినిమా సీత పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. ఇప్పటికే అనుష్క శెట్టి, అనుష్క శర్మ, కియారా అడ్వాణీ, కృతిసనన్‌ పేర్లు వినిపించినప్పటికీ చిత్రబృందం మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని