ధైర్యం కావాలంటే టైమ్‌ మారాలి..!

ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలి. అది కావాలంటే తన టైమ్‌ మారాలి అని అంటున్నారు యువ నటుడు సుశాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బొంభాట్‌’. ‘కలర్‌ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి, సిమ్రాన్‌ చౌదరి కథానాయికలు. రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా...

Published : 02 Dec 2020 19:31 IST

ఆకట్టుకునేలా ‘బొంభాట్‌’ ట్రైలర్‌

హైదరాబాద్‌: ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలి. అది కావాలంటే తన టైమ్‌ మారాలి అని అంటున్నారు యువ నటుడు సుశాంత్‌. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘బొంభాట్‌’. ‘కలర్‌ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి, సిమ్రన్‌ చౌదరి కథానాయికలు. రాఘవేంద్ర వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 3న అమెజాన్ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘బొంభాట్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.

‘సైన్స్‌ని.. లైఫ్‌ను కంట్రోల్‌ చేయడానికో లేదా డిస్ట్రాయ్‌ చేయడానికో వాడకూడదు. బెటర్‌ చేయడానికి మాత్రమే వాడాలి’ అంటూ ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ‘చైత్రను నాలుగేళ్ల నుంచి ప్రేమిస్తున్నా. దూరం నుంచే. దగ్గరికి వెళ్లాలంటే ధైర్యం కావాలి. అది రావాలంటే నాటైమ్‌ మారాలి’ అంటూ సుశాంత్‌ చెప్పిన డైలాగులు మెప్పించేలా ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని