Dhamaka: స్పెయిన్‌లో ‘ధమాకా’ పాట

రవితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌.. అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్‌ వెళ్లింది చిత్రబృందం. అక్కడి

Updated : 17 Mar 2022 08:15 IST

వితేజ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధమాకా’. డబుల్‌ ఇంపాక్ట్‌.. అనేది ఉపశీర్షిక. శ్రీలీల కథానాయిక. టి.జి.విశ్వప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమాలోని పాటల చిత్రీకరణ కోసం స్పెయిన్‌ వెళ్లింది చిత్రబృందం. అక్కడి చారిత్రక ప్రాంతమైన ప్లాజా డి ఎస్పానాలో రవితేజ, శ్రీలీలపై ఓ రొమాంటిక్‌ గీతాన్ని తెరకెక్కిస్తున్నట్టు సినీవర్గాలు తెలిపాయి. ‘‘యాక్షన్‌, వినోదం మేళవింపుగా రూపొందుతున్న చిత్రమిది. ఇటీవలే హైదరాబాద్‌లో రామ్‌ లక్ష్మణ్‌ నేతృత్వంలో కీలకమైన పోరాట ఘట్టాల్ని తెరకెక్కించాం. ఇందులోని ఓ రొమాంటిక్‌ పాటకి స్పెయిన్‌లోని అందమైన ప్రదేశాల్ని ఎంచుకుని చిత్రీకరణ చేస్తున్నాం. ప్రాంతీయ వాస్తు శిల్పంతో కూడిన ప్లాజా డి ఎస్పానాలో తెరకెక్కిస్తున్న పాట చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంద’’ని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: ప్రసన్నకుమార్‌ బెజవాడ, సంగీతం: భీమ్స్‌, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని, సహనిర్మాత: వివేక్‌ కూచిభొట్ల.


రవితేజతో నివేదా

చిరంజీవి 154వ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్‌ నటిస్తోంది. రవితేజకు జోడీగా నివేదా పేతురాజ్‌ని ఎంపిక చేసినట్టు సమాచారం. ఆసక్తికరమైన కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు