ఘనంగా సుధా కొంగర కుమార్తె పెళ్లి

దర్శకురాలు సుధా కొంగర కుమార్తె ఉత్తర వివాహ వేడుక ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ శుభకార్యానికి సినీ ప్రముఖులు మణిరత్నం, సుహాసిని, సూర్య, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న వధూవరులను ఆశీర్వదించారు.

Published : 03 Nov 2020 21:35 IST

హాజరైన ప్రముఖులు..

చెన్నై: దర్శకురాలు సుధా కొంగర కుమార్తె ఉత్తర వివాహ వేడుక ఘనంగా జరిగింది. చెన్నైలోని ఓ స్టార్‌ హోటల్‌లో నిర్వహించిన ఈ శుభకార్యానికి సినీ ప్రముఖులు మణిరత్నం, సుహాసిని, సూర్య, జీవీ ప్రకాశ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. కొత్త ప్రయాణం మొదలు పెట్టబోతున్న వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రత్యేకించి సూర్య పొడవైన జుట్టుతో కనిపించిన తీరు అభిమానుల్ని కట్టిపడేసింది. తన తర్వాతి సినిమాలో సూర్య ఈ గెటప్‌లో కనిపించే అవకాశాలు ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

సూర్య-సుధా కొంగర కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘ఆకాశం నీ హద్దురా!’. ఎయిర్ డెక్కన్‌ వ్యవస్థాపకుడు జీఆర్‌ గోపినాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించిన సినిమా ఇది. నవంబరు 12న ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. నిజానికి వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్‌ భావించింది. కానీ కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చింది. సూర్య త్వరలో పాండిరాజ్‌ తెరకెక్కించబోతున్న సినిమాలో నటించనున్నారు. ఆ సినిమా కోసం పై లుక్‌లో సిద్ధమైనట్లు తెలుస్తోంది.

‘ద్రోహి’ సినిమాతో సుధా కొంగర దర్శకురాలిగా కెరీర్‌ ఆరంభించారు. ఆపై ‘సాలా ఖడూస్‌’తో హిట్‌ అందుకున్నారు. ఇదే సినిమాను తెలుగులో వెంకటేష్‌తో ‘గురు’గా ఆమే తెరకెక్కించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని