అందమైన మహేశ్‌ ఇంటిని చూశారా..!

సెలబ్రిటీల నివాసాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇల్లు ఎలా ఉంటుందో చూడాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల కొన్నిరోజుల క్రితం...

Published : 17 Nov 2020 11:12 IST

ఎన్నోసార్లు వీడియోలు షేర్‌ చేసిన నమ్రత

ఇంటర్నెట్‌డెస్క్‌: సెలబ్రిటీల నివాసాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ముఖ్యంగా సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు ఇల్లు ఎలా ఉంటుందో చూడాలనుకునే వారి సంఖ్య ఎక్కువే. దానికి కారణం లేకపోలేదు. ఇటీవల కొన్నిరోజుల క్రితం మహేశ్‌ సతీమణి నమ్రత.. ఇన్‌స్టా వేదికగా తన గార్డెన్‌.. లివింగ్‌ రూమ్‌కి సంబంధించిన కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. అవి చూసిన నెటిజన్లు మహేశ్‌ ఇల్లు ఎలా ఉంటుందో చూడాలని ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తమ నివాసానికి సంబంధించి పలు సందర్భాల్లో నమ్రత షేర్‌ చేసిన కొన్ని వీడియోలు చూస్తే.. వావ్‌ అనకుండా ఉండరు. అందమైన స్విమ్మింగ్‌పూల్‌, గేమ్స్‌ రూమ్‌, అతిపెద్ద లివింగ్ ఏరియా‌, జిమ్‌, వర్క్ ప్లేస్‌, దేవుడి మందిరం.. ఇలా చెప్పుకుంటూ వెళితే వారి నివాసం ఎన్నో సందర్భాల్లో చూపరులను ఆకట్టుకుంది. సువిశాలమైన మహేశ్‌ ఇంటిని చూడాలని నెటిజన్లు ఆశపడుతున్న నేపథ్యంలో నమ్రత షేర్‌ చేసిన పలు వీడియోలు మీరూ చూసేయండి..

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts