మరో ప్రేమకథా చిత్రంలో విశ్వక్‌సేన్‌

‘హిట్‌’ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలో విజయాన్ని అందుకున్న విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఇటీవల ‘పాగల్‌’ అనే ప్రేమకథా చిత్రానికి ఓకే చేసిన విశ్వక్‌ ఇప్పుడు తాజాగా మరో లవ్‌ స్టోరీని ఓకే చేశారు. తమిళంలో మంచి విజయం సాధించిన లవ్‌....

Published : 28 Dec 2020 13:59 IST

హైదరాబాద్‌: ‘హిట్‌’ చిత్రంతో ఈ ఏడాది ఆరంభంలో విజయాన్ని అందుకున్న విశ్వక్‌సేన్‌ కథానాయకుడిగా కొత్త సినిమా ప్రారంభమైంది. ఇటీవల ‘పాగల్‌’ అనే ప్రేమకథా చిత్రానికి సైన్‌ చేసిన విశ్వక్‌ ఇప్పుడు తాజాగా మరో లవ్‌ స్టోరీని ఓకే చెప్పారు. తమిళంలో మంచి విజయం సాధించిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఓ మై కడవులై’ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. పీవీపీ సినిమాస్‌, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాయి. తాజాగా సోమవారం ఈ సినిమా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా తరుణ్‌ భాస్కర్‌ డైలాగ్స్‌ అందించనున్నారు. మాతృకను తెరకెక్కించిన అశ్వథ్‌ ఈ రీమేక్‌నూ తెరకెక్కించనున్నారు.

ఇదీ చదవండి

నిర్మాతగా ఆచార్య సెట్‌లో రామ్‌చరణ్‌

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని