aamir khan: ఆమె ఫోన్‌ కోసం ఎదురుచూస్తుండిపోయారు!

‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’..బాలీవుడ్‌ నటులు ఆమిర్‌ ఖాన్, జూహీ చావ్లా జంటగా నటించిన ఈ చిత్రం 1988లో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది.

Published : 28 Mar 2023 14:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’..బాలీవుడ్‌ నటులు ఆమిర్‌ ఖాన్, జూహీ చావ్లా జంటగా నటించిన ఈ చిత్రం 1988లో బ్లాక్‌బస్టర్‌ విజయం సాధించింది. ఈ సినిమాలో ఆమిర్‌ ఖాన్‌ చాకొలెట్‌ బాయ్‌ లుక్‌ను చూసి ఫిదా అవ్వని అమ్మాయిలు లేరంటే అతిశయోక్తి కాదు. కానీ అప్పటికే ఆమిర్‌కు పెళ్లైపోయింది. 1986లోనే ఆమిర్‌ తన ప్రేయసి రీనా దత్‌ను పెళ్లి చేసుకున్నారు.

అప్పటికి రీనా చదువు పూర్తికాలేదు. ఈ విషయం గురించి ఆమిర్‌ ఎవ్వరితోనూ చెప్పలేదు. ఓసారి ‘ఖయామత్‌ సే ఖయామత్‌’ చిత్రీకరణ ఊటీ-బెంగళూరు రహదారిపై జరుగుతున్నప్పుడు చిత్రబృందానికి ఏదో సమస్య వచ్చింది. దాంతో పేకప్‌ అయ్యాక చిత్రబృందం అంతా కలిసే ఇంటికి వెళ్లాలని ప్రొడక్షన్‌ మేనేజర్‌ హెచ్చరించారు. ఆ సమయంలో రీనా తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు ముంబయి వెళ్లింది. రీనా ఇంకా ఇంటికి వెళ్లలేదని తెలుసుకున్న ఆమిర్‌ ఆమె స్నేహితురాలు నుజ్హత్‌కు ఫోన్‌ చేశారు. రీనాను క్షేమంగా ఇంటి వద్ద దించి తన హోటల్‌ రూంకు ఫోన్‌ చేయమని చెప్పారట.

అప్పటికే చిత్రబృందానికి ఆలస్యం అవుతోంది. త్వరగా వెళ్లిపోదామని ఎన్నిసార్లు చెప్పినా ఆమిర్‌ వినలేదు. ‘నాకు ముంబయి నుంచి అర్జెంట్‌ ఫోన్‌ కాల్‌ రావాలి. కాసేపు ఆగుదాం’ అని చెప్తూనే ఉన్నారు. దాంతో చిత్రబృందం ఆమిర్‌ ప్రవర్తనకు విసిగి వేసారిపోయింది. అయినా ఆమిర్‌ వారి గురించి పట్టించుకోలేదు. కొద్దిసేపటి తర్వాత నుజ్హత్‌ ఫోన్‌ చేసి రీనా ఎక్కిన బస్‌లో సాంకేతిక లోపం తలెత్తిందని రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకుందని ఆమిర్‌కు చెప్పింది. దాంతో ఊపిరి పీల్చుకున్న ఆమిర్‌ తన చిత్రబృందంతో కలిసి వెళ్లిపోయారు. ఈ సినిమా తర్వాతే ఆమిర్‌ తన పెళ్లి గురించి బయటపెట్టారట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని