Chiranjeevi: చిరు సినిమాలో?

కొత్త అవకాశాల విషయంలో గట్టి పోటీనిస్తోంది కేథరిన్‌. ‘మాచర్ల నియోజకవర్గం’, ‘భళా తందనాన’తోపాటు పలు చిత్రాల్లో నటిస్తోందామె. తాజాగా చిరంజీవి సినిమా విషయంలోనూ ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా

Updated : 01 Apr 2022 14:14 IST

కొత్త అవకాశాల విషయంలో గట్టి పోటీనిస్తోంది కేథరిన్‌. ‘మాచర్ల నియోజకవర్గం’, ‘భళా తందనాన’తోపాటు పలు చిత్రాల్లో నటిస్తోందామె. తాజాగా చిరంజీవి సినిమా విషయంలోనూ ఆమె పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. చిరంజీవి కథానాయకుడిగా... బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఇందులో మరో ప్రముఖ హీరో, హీరోయిన్‌ సందడి చేస్తారు. హీరోగా రవితేజ పేరు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆయనకి జోడీగా నటించే కథానాయిక ఎంపిక విషయంలోనే కొన్ని రోజులుగా కసరత్తులు జరుగుతున్నాయి. ఆ పాత్ర కోసం ఇటీవల కేథరిన్‌ని సంప్రదించినట్టు సమాచారం. హీరో, హీరోయిన్‌ జోడీపై చిత్రబృందం అధికారికంగా స్పందించాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని