Adavallu Meeku Johaarlu: ‘ఆడవాళ్లు..’ టైటిల్‌ సాంగ్‌ వీడియో వచ్చేసింది!

శర్వానంద్‌ హీరోగా రూపొందిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 03 Mar 2022 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శర్వానంద్‌ హీరోగా రూపొందిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఈ కుటుంబ కథా చిత్రం శుక్రవారం విడుదలవుతుంది. ఈ సందర్భంగా టైటిల్ సాంగ్‌ వీడియోను నటుడు రానా దగ్గుబాటి సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేశారు. సినిమా మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు. ఇప్పటికే విడుదలైన లిరికల్‌ వీడియోకు శ్రోతల నుంచి విశేష స్పందన లభించింది. ఈ గీతానికి శ్రీమణి సాహిత్యం అందించగా.. దేవిశ్రీ ప్రసాద్‌ తనదైన శైలిలో ఆలపించి, సంగీతం అందించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ఈ గీతంలోని శర్వానంద్‌ డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రంలో శర్వా సరసన రష్మిక నటించింది. రాధికా, ఖుష్బూ, ఊర్వశీ, ఝాన్సీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి కిశోర్‌ తిరుమల దర్శకత్వం వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని