Deep fake: రష్మికలా.. మరో హీరోయిన్‌ డీప్‌ఫేక్‌ ఫొటో!

రష్మికలానే మరో హీరోయిన్‌ డీప్‌ఫేక్‌కు గురయ్యారు. ఆమె ఎవరంటే?

Published : 08 Nov 2023 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరోయిన్‌ రష్మిక (Rashmika Mandanna) డీప్‌ఫేక్‌ (కృత్రిమ మేధస్సు సాయంతో ఒకరి వీడియోని మరొకరిగా చిత్రీకరించడం) (Deep fake) వీడియో అందరినీ కలవరపాటుకు గురి చేసింది. టెక్నాలజీని కొందరు చెడు కోసం వాడుతున్నారని ఆ ఉదంతం మరోసారి గుర్తు చేసింది. ఈ ఘటనపై ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు స్పందించి రష్మికకు మద్దతుగా నిలిచారు. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో ఈ తరహా వీడియోల అడ్డుకునేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇందులో భాగంగా ఈ తరహా వీడియోల వ్యాప్తిని అడ్డుకోవాల్సిన బాధ్యత సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఉందని గుర్తు చేసింది. ఈ మేరకు ఓ అడ్వైజరీ జారీ చేసింది. అయితే మరోవైపు, బాలీవుడ్‌ నటి కత్రినా కైఫ్‌ (Katrina Kaif) మార్ఫింగ్‌ ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో కనిపిస్తోంది. కత్రినా నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ 3’ (Tiger 3). ఈ సినిమాలో ఆమె టవల్‌తో ఓ యాక్షన్‌ సీన్‌లో నటించారు. డీప్‌ఫేక్‌ ద్వారా ఎవరో ఆమెను ఆశ్లీలంగా చిత్రీకరించారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు డీప్‌ఫేక్‌కు గురికావడంతో చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారి తీసింది.

రష్మిక మార్ఫింగ్‌ వీడియో.. ఒరిజినల్‌ క్లిప్‌లో ఉన్న జరా పటేల్‌ ఏమన్నదంటే..?

డీప్‌ఫేక్‌ టెక్నాలజీని ఉపయోగించి జరా పటేల్‌ అనే ఇన్‌ఫ్లూయెన్సర్‌ వీడియోను కొందరు రష్మికలా మార్ఫింగ్‌ చేసి, ఆ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. తొలుత బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఆ వీడియోపై స్పందిస్తూ బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని