akshay kumar: పద్నాలుగేళ్ల తర్వాత.. మరోసారి..

అగ్ర హీరో అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌ ఊపందుకోవడంలో సహకరించిన సినిమాల్లో ‘హేరాఫేరీ’ ఒకటి. ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. పద్నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం పట్టాలెక్కనుంది. ‘మేమిద్దరం చివరిసారిగా 2010లో ‘కట్టా మీటా’లో కలిసి పని చేశాం. దాని తర్వాత చాలా ప్రాజెక్టుల కోసం చర్చలు జరిపినా.. ఏదీ కార్యరూపం దాల్చలేదు.

Updated : 07 Feb 2024 09:32 IST

గ్ర హీరో అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌ ఊపందుకోవడంలో సహకరించిన సినిమాల్లో ‘హేరాఫేరీ’ ఒకటి. ప్రియదర్శన్‌ తెరకెక్కించారు. పద్నాలుగేళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో చిత్రం పట్టాలెక్కనుంది. ‘మేమిద్దరం చివరిసారిగా 2010లో ‘కట్టా మీటా’లో కలిసి పని చేశాం. దాని తర్వాత చాలా ప్రాజెక్టుల కోసం చర్చలు జరిపినా.. ఏదీ కార్యరూపం దాల్చలేదు. పద్నాలుగేళ్ల తర్వాత మరోసారి కలిసి పని చేసే సమయం వచ్చేసింది. ఇది కామిక్‌ ఫాంటసీ చిత్రంగా తెరకెక్కనుంది. వినోదం ప్రధానంగా సాగనుంది’ అంటూ వివరాలు వెల్లడించారు ప్రియదర్శన్‌. ఏక్తా కపూర్‌ నిర్మించే ఈ చిత్ర షూటింగ్‌ సెప్టెంబరులో ప్రారంభం కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని