Akshay Kumar: గొప్ప వారాన్ని అందించారు.. ధన్యవాదాలు

‘‘భారత చలనచిత్ర చరిత్రలో గొప్ప వారం’...ప్రేక్షకులకు ధన్యవాదాలు’...ఓ మై గదర్‌...అంటూ బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. ఇటీవల ఒకే రోజు విడుదలైన ‘ఓ మై గాడ్‌ 2’, ‘గదర్‌ 2’ చిత్రాలకు మంచి స్పందన రావడంతో సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు అక్షయ్‌.

Updated : 18 Aug 2023 13:50 IST

‘‘భారత చలనచిత్ర చరిత్రలో గొప్ప వారం’...ప్రేక్షకులకు ధన్యవాదాలు’...ఓ మై గదర్‌...అంటూ బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ తెలిపారు. ఇటీవల ఒకే రోజు విడుదలైన ‘ఓ మై గాడ్‌ 2’, ‘గదర్‌ 2’ చిత్రాలకు మంచి స్పందన రావడంతో సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు అక్షయ్‌. కరోనా తర్వాత ఈ రెండు సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లను సొంతం చేసుకున్నాయని ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా(పీజీఐ), మల్టీప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎంఏఐ) తెలిపాయి. రెండు సీక్వెల్‌ చిత్రాల పేర్లు కలిసేటట్లు ‘ఓమైగదర్‌’ అంటూ...‘‘ఓమైగదర్‌’ చిత్రాలపై చూపిస్తున్న ప్రేమకు ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. భారత చలనచిత్ర చరిత్రలో మర్చిపోలేని ఒక గొప్ప వారాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు’ అని అక్షయ్‌ కుమార్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘ఓ మై గాడ్‌ 2’ చిత్రాన్ని అమిత్‌ రాయ్‌ తెరకెక్కించారు. ఈ సినిమాలో ‘గదర్‌ 2’ చిత్రంలోని ‘ఉద్ద్‌ జా కాలే కావన్‌’ అనే పాటను శివుడి దూత పాత్రలో ఉన్న అక్షయ్‌ కుమార్‌ పాడటం ఆసక్తిగా ఉంది. 1971 నేపథ్యంలో తెరకెక్కిన ‘గదర్‌ 2’ చిత్రానికి అనిల్‌ శర్మ దర్శకత్వం వహించారు. తన కొడుకును కాపాడుకోవటానికి పాకిస్థాన్‌కి వెళ్లి అక్కడి ఆర్మీతో యుద్ధం చేసే తారా సింగ్‌ కథే ఈ చిత్రం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని