Alia Bhatt: సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేశారు: అలియా భట్‌

తనపై వచ్చిన రూమర్స్‌పై అలియా భట్‌ (Alia Bhatt) స్పందించారు. ‘కాఫీ విత్‌ కరణ్‌’ టాక్‌షోలో వీటి గురించి మాట్లాడారు.

Published : 17 Nov 2023 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సెలబ్రిటీ టాక్‌షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ (Koffee With Karan) తాజా ఎపిసోడ్‌కు బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్‌ కరీనా కపూర్‌, అలియా భట్‌ హాజరై సందడి చేశారు. ర్యాపిడ్‌ ఫైర్‌లో భాగంగా కరణ్‌ అడిగిన ప్రశ్నలకు వీళ్లిద్దరూ సమాధానాలు చెప్పారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన క్లిపింగ్స్‌ కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనపై వచ్చిన అతిపెద్ద రూమర్‌పై అలియా (Alia Bhatt) స్పందించారు.

‘ఇది ఇంటర్నెట్‌ యుగం. ఎప్పుడూ ఏదో ఒక రూమర్‌ వస్తూనే ఉంటుంది. నేను కొవ్వు తగ్గించుకొని సన్నగా మారడానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోవడం కోసం కొన్ని సర్జరీలు చేయించుకున్నానని ప్రచారం చేశారు. అలాగే నా వైవాహిక జీవితంలోనూ సమస్యలున్నాయంటూ రకరకాల రూమర్స్‌ను క్రియేట్‌ చేశారు. అవన్నీ వాళ్ల అపోహలు మాత్రమే. అందుకే వాటిని నేను పట్టించుకోను. అవి నన్ను బాధించవు’ అని సమాధానం చెప్పారు.

ఈసారి వరల్డ్‌ కప్‌ మనదే.. ఫైనల్‌ మ్యాచ్‌పై రజనీకాంత్‌ కామెంట్స్‌

ఇక ఇదే షోలో రణ్‌బీర్‌ తనను వేధిస్తున్నాడంటూ వచ్చిన వార్తలపై కూడా అలియా స్పందించారు. ‘నేను గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రణ్‌బీర్‌కు లిప్‌స్టిక్‌ నచ్చదని, నేను వేసుకున్న వెంటనే తీసేయాలంటాడని చెప్పాను. ఆ విషయాన్ని అందరూ తప్పుగా అర్థంచేసుకున్నారు. అతడు నన్ను వేధిస్తున్నాడంటూ రకరకాల వార్తలు రాశారు. కానీ, రణ్‌బీర్‌ మంచి వ్యక్తి. అందుకే ఇలాంటి వాటి గురించి ఆలోచించను. అసలు ప్రపంచం దృష్టి పెట్టాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ, ఇలాంటి విషయాలపై ఎక్కువ ఫోకస్‌ చేయడం బాధకలిగిస్తుంది’ అని అలియా భట్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని