Allu Arjun: ఇది వేసవి ‘దసరా’ : అల్లు అర్జున్‌

అల్లు అర్జున్‌ తాజాగా ‘దసరా’ను వీక్షించారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని బయటపెడుతూ ఆయన ట్వీట్‌ చేశారు.

Published : 17 Apr 2023 14:05 IST

హైదరాబాద్‌: నాని (Nani) హీరోగా నటించిన ‘దసరా’ (Dasara)పై అల్లు అర్జున్‌ (Allu Arjun) ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ఈ సినిమా చూసిన ఆయన ఇది తనకెంతో నచ్చిందన్నారు. చిత్రం కోసం పనిచేసిన ప్రతి ఒక్కరినీ మెచ్చుకుంటూ ట్వీట్‌ చేశారు.

‘‘దసరా’ టీమ్‌ మొత్తానికి నా అభినందనలు. అద్భుతంగా చిత్రాన్ని తెరకెక్కించారు. అత్యుత్తమ ప్రదర్శనతో నాని, కీర్తిసురేశ్‌ ఆకట్టుకున్నారు. సంతోష్‌ నారాయణన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, సత్యన్‌ కెమెరా పనితనం బాగున్నాయి. కెప్టెన్‌ ఆఫ్‌ ది షిప్‌ శ్రీకాంత్‌ ఓదెల తన పనితనంతో తొలి ప్రయత్నంలోనే అదరగొట్టేశారు. ప్రతి సీన్‌నూ ఆయన అద్భుతంగా చిత్రీకరించారు. సమ్మర్‌లో వచ్చిన నిజమైన ‘దసరా’ (పండుగ ఉద్దేశం వచ్చేలా) ఇది’’ అని బన్నీ పేర్కొన్నారు.

సింగరేణి ప్రాంతం నేపథ్యంలో ‘దసరా’ (dasara) సిద్ధమైంది. స్నేహం, ప్రేమ, పగ.. వంటి భావోద్వేగాలతో సాగే కథ ఇది. ఈసినిమాతో శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడిగా పరిచయమయ్యారు. మార్చి 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. రూ.65 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ ప్రాజెక్ట్‌ విడుదలైన కొన్నిరోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సినీ విశ్లేషకుల అంచనా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని