Amitabh Bachchan: అవన్నీ ఫేక్‌ వార్తలు.. ‘అనారోగ్యం’పై అమితాబ్‌ క్లారిటీ

తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని అమితాబ్‌ తెలిపారు.

Updated : 16 Mar 2024 19:00 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన ఆరోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌ అని బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమితాబ్‌ బచ్చన్‌ స్పష్టం చేశారు. ఆయన అస్వస్థతకు గురైనట్లు మార్చి 15న సోషల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబయిలోని కోకిలాబెన్‌ ఆసుపత్రిలో చేరారని.. యాంజియోప్లాస్టీ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో బిగ్‌బీ అభిమానులు కంగారు పడ్డారు.  తాజాగా ఆయన ఇండియన్‌ స్ట్రీట్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ISPL) ఫైనల్స్‌కు హాజరయ్యారు. అక్కడి మీడియా ప్రతినిధులు ‘అమితాబ్‌ మీ ఆరోగ్యం ఎలా ఉంది’ అని అడగ్గా.. ‘బాగున్నాను.. నా అనారోగ్యంపై వస్తోన్న వార్తలన్నీ ఫేక్‌’ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్‌ ఊపిరిపీల్చుకున్నారు. అమితాబ్‌ ఐఎస్‌పీఎల్‌ ఫైనల్స్‌లో హుషారుగా పాల్గొని సందడి చేశారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌తో కలిసి మ్యాచ్‌ను వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్‌ అవుతున్నాయి.

అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్‌ ఎంట్రీ సంగతులివీ..

అమితాబ్‌ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినిమాల్లోనూ నటిస్తున్నారు. ప్రభాస్‌ - నాగ్‌ అశ్విన్‌ కాంబోలో తెరకెక్కుతోన్న ‘కల్కి 2898 ఏడీ’ (Kalki)లో కీలకపాత్రలో కనిపించనున్నారు. మే9న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టి.జి. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రజనీకాంత్‌ నటిస్తోన్న  ‘తలైవా 170’ (Thalaivar 170)లోనూ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని