Naani: ‘అంటే సుందరానికీ’ టీజర్‌ చూశారా...

న్యాచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘అంటే సుందరానికి’ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 

Updated : 20 Apr 2022 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేచురల్‌ స్టార్‌ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా జూన్‌ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది. ‘మీకింకా అసలు విషయం చెప్పలేదంటూ’ నాని నవ్వులు పూయిస్తూ ‘సెలబ్రేట్‌ ది మ్యాడ్‌నెస్‌ ఆఫ్‌ లవ్‌, లాఫ్టర్‌ అండ్‌ ఫ్యామిలీ’ అంటూ సాగే ఈ టీజర్‌ సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది.  వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమాలో నాని సరసన మలయాళ భామ నజ్రియా నటిస్తోంది. కంప్లీట్‌ ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను మైత్రీ మూవీస్‌ మేకర్స్ బ్యానర్‌పై నవీన్‌ యెర్నేని, వై.రవి శంకర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని