Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్‌ మల్టీస్టారర్‌ సినిమా

‘సినిమా బండి’ చిత్రంతో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల. ఇప్పుడాయన అనుపమ పరమేశ్వరన్‌తో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 11 Jun 2023 09:08 IST

‘సినిమా బండి’ చిత్రంతో ఓటీటీ వేదికగా సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల. ఇప్పుడాయన అనుపమ పరమేశ్వరన్‌తో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ప్రవీణ్‌ ప్రకటించారు. కాగా, ఇప్పుడిందులో నటించనున్న మరో నాయికను ప్రకటించారు. ‘హ్రిదయం’, ‘జయ జయ జయ జయహే’ వంటి మలయాళ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శన రాజేంద్రన్‌ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. సంగీత మరో కీలక పాత్రలో నటించనున్నారు. ట్రావెల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే నాయికా ప్రాధాన్య చిత్రమిదని.. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుందని తెలిసింది. ఈ సినిమాని విజయ్‌ డొంకాడ నిర్మించనున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని