Anupama Parameswaran: అనుపమ.. గానం

అనుపమ పరమేశ్వరన్‌లో మంచి నటితో పాటు చక్కని గాయని ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాల వేదికగా తన గానామృతంతో అభిమానుల్ని అలరిస్తుంటుంది.

Updated : 07 Dec 2022 17:50 IST

నుపమ పరమేశ్వరన్‌లో మంచి నటితో పాటు చక్కని గాయని ఉందన్న సంగతి తెలిసిందే. ఆమె అప్పుడప్పుడూ సామాజిక మాధ్యమాల వేదికగా తన గానామృతంతో అభిమానుల్ని అలరిస్తుంటుంది. ఇప్పుడామె తొలిసారి ‘బటర్‌ఫ్లై’ సినిమాతో వెండితెరపై తన పాట వినిపించేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ థ్రిల్లర్‌ చిత్రాన్ని గంటా సతీష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. రవి ప్రకాష్‌ బోడపాటి, టి.ప్రసాద్‌, ఎన్‌.ప్రదీప్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘ఆల్‌ ద లేడీస్‌..’’ అనే గీతాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇటీవల విడుదల చేశారు. మహిళలకు స్ఫూర్తినిచ్చేలా సాగుతున్న ఈ పాటకు అరవింద్‌ షారోన్‌ (అర్విజ్‌) స్వరాలు సమకూర్చగా.. అనంత శ్రీరామ్‌ సాహిత్యమందించారు. అనుపమ పరమేశ్వరన్‌ స్వయంగా ఆలపించింది. ‘‘విభిన్నమైన థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామ’’న్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రానికి అర్విజ్‌, గిడోన్‌ కట్టా స్వరాలందిస్తున్నారు. సమీర్‌ రెడ్డి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని