AR Murugadoss: అయిదేళ్ల క్రితమే ఆయనకి కథ చెప్పాను: ఏఆర్‌ మురుగదాస్‌

సల్మాన్‌ఖాన్‌కు గతంలోనే స్క్రిప్ట్‌ వివరించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మురుగదాస్‌ తెలిపారు.

Published : 19 Mar 2024 17:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ (AR Murugadoss) సల్మాన్‌ ఖాన్‌తో(almam Khan) సినిమా చేయనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ‘‘సల్మాన్‌ ఖాన్‌కు అయిదు సంవత్సరాల క్రితం ఓ స్క్రిప్ట్‌  వివరించాను. అది నచ్చలేదు. ఇటీవల చెప్పిన మరో కథను అంగీకరించారు. ‘ఈ కథ నాకెంతో నచ్చింది. మంచి హిట్‌ అవుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిద్దాం’ అని చెప్పారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇది పాన్‌ఇండియా స్థాయిలో రూపొందే భారీ యాక్షన్‌ చిత్రం. ఇందులో సల్మాన్‌ఖాన్‌ సరికొత్తగా కనిపిస్తారు. భావోద్వేగ సన్నివేశాలతో ప్రేక్షకులకు మంచి సందేశాన్ని అందిస్తుంది. ఇప్పుడు చేస్తున్న చిత్రం పూర్తయిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది. 2025 ఈద్‌కు ప్రేక్షకుల ముందుకు వస్తుంది’’ అని మురుగదాస్‌ వెల్లడించారు.  

ప్రస్తుతం శివకార్తికేయన్‌ కొత్త చిత్రానికి మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. SK23 వర్కింగ్‌ టైటిల్‌తో చిత్రీకరణ ప్రారంభించారు. రుక్మిణి వసంత్‌ కథానాయిక. అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంగీతం అందిస్తున్నారు. వినూత్నమైన కథాంశంతో రూపొందుతోన్న యాక్షన్‌ సినిమా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని