Manushi Chhillar: పెళ్లైన వ్యాపారవేత్తతో మాజీ ప్రపంచ సుందరి ప్రేమాయణం..?

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ప్రముఖ వ్యాపారవేత్త నిఖిల్‌ కామత్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

Updated : 23 Nov 2022 14:18 IST

ముంబయి: ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుని తన అందంతో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టారు హరియాణా బ్యూటీ మానుషి చిల్లర్ (Manushi Chhillar)‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో రాణిస్తోన్న ఈ భామకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త, జెరోదా సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిఖిల్ కామత్‌తో ఆమె డేటింగ్‌లో ఉన్నారంటూ.. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారని ఆ వార్తల్లోని సారాంశం. బాలీవుడ్‌లో జరిగే పలు పార్టీలకు వీరిద్దరూ కలిసే హాజరవుతున్నారని, ఇటీవల రుషికేశ్‌లోనూ వీరు ప్రత్యేక పూజలు చేశారని పేర్కొంటూ పలు ఫొటోలు బయటకు వచ్చాయి. కెరీర్‌ను దృష్టిలో ఉంచుకొనే ఆమె ఈ బంధాన్ని అధికారికంగా ప్రకటించడం లేదని పలువురు అంటున్నారు.

2017లో ప్రపంచ సుందరిగా గెలుపొందిన అనంతరం మానుషికి బాలీవుడ్‌ నుంచి అవకాశాలు వరుసకట్టాయి. ఆమె కథానాయికగా వెండితెరకు పరిచయమైన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ స్పందనలు సొంతం చేసుకుంది. ఆమె ప్రస్తుతం విక్కీ కౌశల్‌తో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ చేస్తున్నారు. నిఖిల్‌ విషయానికి వస్తే.. 2021లో తన భార్య నుంచి విడాకులు తీసుకున్నారు. అదే సమయంలో మానుషితో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని