‘రంగస్థలానికి కొత్త ఆటగాడు వచ్చాడు’ అతడే..

‘‘ఆడుతూ వెళ్తే వెయ్యి ఎత్తులు.. వెతుకుతూ వెళ్తే వెయ్యి సమాధానాలు.. కానీ, ఒక జవాబు నిన్నే వెతక్కుంటూ వచ్చినప్పుడు

Updated : 25 Mar 2023 17:15 IST

హైదరాబాద్‌: ‘‘ఆడుతూ వెళ్తే వెయ్యి ఎత్తులు.. వెతుకుతూ వెళ్తే వెయ్యి సమాధానాలు.. కానీ, ఒక జవాబు నిన్నే వెతక్కుంటూ వచ్చినప్పుడు నువ్వు అడగాల్సింది.. సరైన ప్రశ్న’’ అంటున్నారు రోహిత్‌శెట్టి. ఆయన కథానాయకుడిగా వచ్చిన పాన్‌ ఇండియా మూవీ ‘అతడే శ్రీమన్నారాయణ’. సచిన్‌ రవి దర్శకుడు. శాన్వి శ్రీవాత్సవ కథానాయిక. 2019లో విడుదలైన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో థియేటర్‌లో అలరించిన ఈ చిత్రం తెలుగులో టెలివిజన్‌లో కానీ, ఓటీటీలో కానీ అందుబాటులోకి రాలేదు.

ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ‘ఆహా’లో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఫాంటసీ అడ్వెంచర్‌ కామెడీ ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో కథ, కథనాలు ఉత్కంఠగా సాగుతాయి. కథానాయకుడు రక్షిత్‌శెట్టి ఓ వైపు హాస్యం పంచుతూనే యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టాడు. నిధి వేట నేపథ్యంలో సాగే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. ‘‘జెంటిల్‌మెన్‌.. రేపు మీ గురించి చరిత్రలో ఎవరైనా రాస్తే అందులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మీరు అతన్ని కలవడానికి ముందు.. రెండు మీరు అతన్ని కలిసిన తర్వాత.. అతడే శ్రీమన్నారాయణ’’ అంటూ చివరిలో రక్షిత్‌శెట్టి డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని