Avikagor: స్టేజ్‌పై కన్నీరు పెట్టుకున్న అవికాగోర్‌

‘చిన్నారి పెళ్లికూతురు’గా తెలుగువారికి చేరువైన నటి అవికాగోర్‌. ప్రస్తుతం విభిన్న చిత్రాల్లో నటిస్తూ ఇక్కడి ప్రేక్షకుల్ని అలరిస్తోన్న ఈ భామ కెరీర్‌ పరంగా మరో ముందడుగు వేశారు.

Updated : 04 Jan 2023 22:04 IST

హైదరాబాద్‌: తెలుగు సినీ ప్రేక్షకులు తనపై చూపిస్తోన్న ప్రేమాభిమానాన్ని గుర్తు చేసుకుని కన్నీరు పెట్టుకున్నారు నటి అవికాగోర్‌ (Avika Gor). తొలిసారి ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘పాప్‌కార్న్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆమె భావోద్వేగానికి గురయ్యారు.

‘‘మొదటిసారిగా ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నాగార్జున సర్‌కు ధన్యవాదాలు. ‘ఉయ్యాలా జంపాలా’ నుంచి ఆయన నాకు తెలుసు. నన్ను వాళ్ల కుటుంబంలో సభ్యురాలిగా చూస్తారు. నా కల నిజమైన రోజు ఇది. 25 ఏళ్ల వయసులోనే సహ నిర్మాతగా తొలి అడుగు వేసినందుకు ఆనందంగా ఉంది. ఇందుకు ఎంతో గర్వపడుతున్నా. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేయడం కోసం నేను మరింత కష్టపడి పనిచేస్తాను’’ అంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం నాగార్జున మాట్లాడుతూ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. అవికాగోర్‌ మంచి నటి అని.. ఆమెకు ఎన్నో దేశాల్లో అభిమానులు ఉన్నారని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని