Sai Rajesh-Vishwak Sen: విశ్వక్‌ను ఎప్పుడూ అవమానించలేదు: వివాదంపై తొలిసారి మాట్లాడిన సాయిరాజేశ్‌

విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)తో వివాదంపై దర్శకుడు సాయిరాజేశ్‌ (Sai rajesh) తొలిసారి స్పందించారు. విశ్వక్‌ను తాను ఎప్పుడూ అవమానించలేదన్నారు.

Updated : 02 Aug 2023 17:17 IST

హైదరాబాద్‌: ‘బేబీ’ (Baby) విషయంలో నటుడు విశ్వక్‌సేన్‌ (Vishwak Sen)తో నెలకొన్న వివాదంపై దర్శకుడు సాయి రాజేశ్‌ (Sai Rajesh) తొలిసారి స్పందించారు. తాను ఎప్పుడూ విశ్వక్‌ను అవమానించలేదన్నారు. ‘బేబీ’ కథ మొదట విశ్వక్‌ వద్దకే వెళ్లిందని కాకపోతే ఆయన రిజక్ట్‌ చేశారన్నారు.

‘‘బేబీ’ కథ మొదట విశ్వక్‌ వద్దకే వెళ్లింది. ఆయన రిజక్ట్‌ చేశారు. బిజీ షెడ్యూల్‌ వల్ల కథను వద్దనుకున్నారా? లేదా మరేదైనా కారణమా? అనేది తెలియదు. ఇటీవల ఆయన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొని.. ‘హిట్‌లో ఉన్నారు. దాన్ని ఎంజాయ్‌ చేయండి. అవతలివాళ్లను అనుమానించవద్దు’ అన్నారు. ఇప్పటివరకూ నేను ఆయన పేరు ఎక్కడా చెప్పలేదు. ఆయన్ని అవమానించే ఉద్దేశం నాకు లేదు. నా వద్ద కథ ఉందంటూ ఓసారి గీతాఆర్ట్స్‌ సంస్థ విశ్వక్‌కు ఫోన్‌ చేసింది. దానిని ఆయన రిజక్ట్‌ చేశారు. విశ్వక్‌ ఏమైతే అన్నాడో ఆ మాటలను ఫిల్టర్‌ చేయకుండా ఆ సంస్థ వాళ్లు నాతో చెప్పారు. బాధగా అనిపించింది. ఆయన ఆ మాటలు అనడానికి కారణాన్ని నేను అర్థం చేసుకోగలను. తిరస్కరణ కూడా మర్యాదపూర్వకంగా ఉంటే బాగుంటుందనిపించింది’’ అని సాయి రాజేశ్‌ తెలిపారు. అయితే, ఇప్పటివరకూ తాను విశ్వక్‌ పేరు చెప్పలేదన్నారు. ఇంత వివాదం జరగకుండా ఉండుంటే బాగుండేదన్నారు.

నరేశ్‌కు ఊరట.. ఆయన ఇంట్లోకి రమ్య రఘుపతి రాకూడదు : కోర్టు ఉత్తర్వులు

ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బేబీ’. సాయి రాజేశ్‌ దర్శకుడు. జులై నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అంతటా మంచి విజయాన్ని అందుకుంది. ఆనంద్‌ దేవరకొండ తనను ఎంతో నమ్మాడని.. కథ సరిగ్గా చెప్పనప్పటికీ తనపై నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని చేశాడని సాయిరాజేశ్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు