Ap News: చెడును అంతం చేసి మంచి వైపు ప్రయాణమే సంక్రాంతి: బాలకృష్ణ

చెడును అంతం చేసి మంచి వైపు మన ప్రయాణమే సంక్రాంతి అని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ

Updated : 14 Jan 2022 13:46 IST

కారంచేడు: చెడును అంతం చేసి మంచి వైపు మన ప్రయాణమే సంక్రాంతి అని హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. తెలుగు వారందరికీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకాశం జిల్లా కారంచేడులో తన సోదరి పురందేశ్వరి నివాసంలో నిర్వహించిన సంక్రాంతి సంబురాల్లో బాలకృష్ణ పాల్గొన్నారు. సమాజంలో సంపద పెంచే పండుగ సంక్రాంతి అని బాలకృష్ణ అన్నారు. చెమటోడ్చి పండించిన పంటలు ఇంటికి చేరే పండుగ.. రైతులు, రైతుకూలీలు, గ్రామీణులు, మహిళలు, యువత, అందరిలో ఆనందం నింపే పండుగ సంక్రాంతి అని తెలిపారు. క్రాంతి అంటే మార్పు.. సంక్రాంతి అంటే మంచిమార్పు అని అన్నారు. భోగిమంటలు వేయడం, రంగవల్లులతో సంక్రాంతిని స్వాగతించడం, గ్రామీణ క్రీడలతో సంబురాలు జరుపుకోవడం, పెద్దలను స్మరించుకోవడం, రైతు నేస్తాలైన పశువులను పూజించడం అనాదిగా వస్తున్న మన సంప్రదాయమని గుర్తుచేశారు. అన్నివర్గాల ప్రజల అభివృద్ధికి, సమాజ హితానికి ఈ సంక్రాంతి శుభకరం కావాలని, ఇంటింటా ఆనందాలను నింపాలని మనసారా కోరుకుంటున్నట్లు బాలకృష్ణ తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని