Chiranjeevi: చిరు.. ఎవరైనా ఈ రంగాన్ని ఏలొచ్చని మీవల్లే తెలిసింది: బండ్ల గణేశ్‌

ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ స్టైలిష్‌ లుక్స్‌తో అందరి మన్ననలు అందుకుంటున్నారు అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). ఆయన లేటెస్ట్‌ లుక్‌కు నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) ఫిదా అయ్యారు...

Published : 08 Aug 2022 13:33 IST

హైదరాబాద్‌: ఆరు పదుల వయసులోనూ వరుస సినిమాలు చేస్తూ స్టైలిష్‌ లుక్స్‌తో అందరి మన్ననలు అందుకుంటున్నారు అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). ఆయన లేటెస్ట్‌ లుక్‌కు నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) ఫిదా అయ్యారు. ఆయన స్టైల్‌ని మెచ్చుకుంటూ వరుస ట్వీట్లు చేశారు. ‘‘ఈ స్టైల్ చూసే మీ మీద ప్రేమ పెంచుకున్నాం. ఈ స్టైల్ చూసే మేము సినిమా రంగం వైపు పరుగులు పెట్టాం. ఈ స్టైల్ వల్లే సినిమా రంగం అనేది ఒకటుంటుంది, ఇక్కడ ఏమైనా సాధించవచ్చనే నమ్మకం కలిగింది. ఈ స్టైల్‌ చూసే ఇక్కడ ఎవరైనా ఏదైనా కావచ్చు అనే నిర్ణయానికి వచ్చాం. ఈ స్టైల్‌ చూసే మీకు అభిమానులుగా మారిపోయాం. మీరు ఎప్పటికీ ఇలాగే స్టైల్‌గా ఉండాలని మా కోరిక. ఎవరైనా ఈ రంగంలో ఏలవచ్చు అనే నమ్మకం కల్పించిన మీ స్టైల్ అంటే మాకు ఇష్టం’’ అని బండ్ల గణేశ్‌ పేర్కొన్నారు. 

ప్రస్తుతం బండ్లన్న చేసిన ట్వీట్లు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘గాడ్‌ఫాదర్‌’తోపాటు బాబీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. తాజాగా ఓ ఫొటోషూట్‌లో పాల్గొన్నారు. ఆ ఫొటోలపైనే బండ్ల గణేశ్‌ కామెంట్స్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని