Bhala Thandhanana: శ్రీవిష్ణు జీవితం జర్నలిస్టు చేతుల్లో.. ఉత్కంఠగా ‘భళా తందనాన’ ట్రైలర్‌

శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకుడు. కేథరిన్‌ కథానాయిక. ఈ సినిమా మే 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేసింది.

Published : 02 May 2022 01:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన చిత్రం ‘భళా తందనాన’. చైతన్య దంతులూరి దర్శకుడు. కేథరిన్‌ కథానాయిక. ఈ సినిమా మే 6న విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ను ఆదివారం విడుదల చేసింది. ‘తన పేరు శశిరేఖ. ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టు..’ అంటూ కథానాయిక పాత్ర గురించి తెలియజేసే సంభాషణతో ట్రైలర్‌ ప్రారంభమై, ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కూల్‌, మాస్‌ లుక్‌లో శ్రీవిష్ణు ఆకట్టుకునేలా ఉన్నాడు. కథానాయకుడి దగ్గర రూ. 2000 కోట్లు ఉండటానికి కారణమేంటి? ఆయన చేసిన చేసిన మోసాల్ని శశిరేఖ ఎలా పసిగట్టింది? తదితర ఆసక్తికర ప్రశ్నలు ట్రైలర్‌ చూస్తుంటే ఉత్పన్నమవుతాయి. వీటికి సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ, కథ, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా, కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని