Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ హౌస్‌లోనే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక..

బిగ్‌బాస్‌ సీజన్‌-7లో (Bigg Boss Telugu 7) ఫ్యామిలీ వీక్‌లో భాగంగా గౌతమ్‌కృష్ణ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ్‌ వచ్చి సందడి చేశారు.

Updated : 08 Nov 2023 18:14 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7లో (Bigg Boss Telugu 7) ఫ్యామిలీ వీక్‌ కొనసాగుతోంది. ఇప్పటికే హౌస్‌లోకి శివాజీ తనయుడు, అర్జున్ సతీమణి, అశ్విని తల్లి వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గౌతమ్‌ కృష్ణ తల్లి హౌస్‌లోకి వచ్చారు. ‘అమ్మా.. అమ్మా... నీ వెన్నెల’ పాటతో విడుదల చేసిన ప్రోమో భావోద్వేగానికి గురి చేసింది. హౌస్‌మేట్స్‌తో ఆమె మాట్లాడుతూ అందరికీ గోరుముద్దలు తినిపించారు. ఇక ప్రియాంక కోసం ఆమె ప్రియుడు శివ్‌ రావడంతో హౌస్‌లో సందడి రెట్టింపైంది. హౌస్‌లోకి వచ్చిన వెంటనే గులాబీ పువ్వు ఇచ్చి, ప్రియాంకకు ప్రపోజ్‌ చేశాడు. ‘పెళ్లి ఎప్పుడు’ అని ప్రియాంక అడగ్గా, ‘నువ్వు బయటకు రాగానే చేసుకుందాం’ అని శివ్‌ సమాధానం ఇచ్చాడు. ‘లేదు ఇప్పుడే చేసుకుందాం’ అంటూ ప్రియాంక సమాధానం ఇచ్చింది. ‘ఐదు నిమిషాలు అయినట్లే ఉంది వాళ్ళు చెప్పినట్టు’ అని ప్రియాంక అనగా, ‘ఉండమని చెప్పొచ్చు కదా ఈ రోజు నైట్. బిగ్ బాస్ ఈరోజు ఉండొచ్చా బిగ్ బాస్’ శోభ బిగ్‌బాస్‌ను రిక్వెస్ట్‌ చేసింది.  ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బిగ్‌బాస్‌ షో అభిమానులను అలరిస్తోంది.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని