Bimbisara: కల్యాణ్‌రామ్‌ ‘బింబిసార’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బింబిసార’. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు.

Updated : 02 Apr 2022 15:11 IST

హైదరాబాద్‌: కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘బింబిసార’. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. వశిష్ట దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్నారు. ఉగాది సందర్భంగా ఈ చిత్ర విడుదల తేదీని ఖరారు చేశారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘బింబిసార’ను ఆగస్టు 5న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

‘కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో, అత్యున్నత సాంకేతిక హంగులతో రూపొందుతున్న సినిమా ఇది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: చిరంతన్‌ భట్‌, ఛాయాగ్రహణం: సంతోష్‌ నారాయణ్‌, కూర్పు: తమ్మిరాజు, మాటలు: వాసుదేవ్‌ మునెప్పగారి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని