అజయ్‌ దేవగణ్‌ ‘సైతాన్‌’ సెన్సార్‌ బోర్డు ఏం చెప్పిందంటే?

అజయ్‌ దేవగణ్‌ ‘సైతాన్‌’ చిత్రంలో కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించాలని సెన్సార్‌ బోర్డు సూచించింది.

Published : 06 Mar 2024 17:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn), జ్యోతిక (Jyotika), ఆర్‌.మాధవన్‌ (R.Madhavan) కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘సైతాన్‌’. ఈ సినిమాను వికాస్‌ బహ్ల్‌ తెరకెక్కించారు. 25 ఏళ్ల తర్వాత జ్యోతిక బాలీవుడ్‌లో చేస్తున్న సినిమా కావడంతో హిందీ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయాలంటూ సెన్సార్‌ బోర్డ్‌ ఆదేశించింది. ఈ సినిమా బ్లాక్‌ మ్యాజిక్‌ను సపోర్ట్‌ చేస్తూ రూపొందించింది కాందంటూ వాయిస్‌ ఓవర్‌లో తెలియజేయాలని సూచించింది. దీనితోపాటు కొన్ని సన్నివేశాల నిడివి 25 నిమిషాలు తగ్గించాలని, అభ్యంతరకరమైన పదాలను మార్చాలంటూ కోరింది.  ఈ మార్పులు చేసిన తర్వాత సినిమా రన్‌ టైమ్‌ 2:12 గంటలు ఉంటుందని చిత్రవర్గాల సమాచారం. 

హారర్‌ థ్రిల్లర్‌గా జియో స్టూడియోస్‌, అజయ్‌ దేవగణ్‌ ఫిల్మ్‌, పనోరమా స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఇందులో ఆర్‌.మాధవన్‌ నెగిటివ్‌ షేడ్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది. సరదాగా సాగిపోతున్న కుటుంబంలోకి అనుకోని అతిథి ప్రవేశిస్తాడు. అతని కారణంగా ఆ కుటుంబం ఎలాంటి సమస్యలు ఎదుర్కొంది. అందులోంచి వారెలా బయటపడ్డారన్న అంశాలతో కథనం సాగుతుంది. ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా థ్రిల్ల్‌ చేస్తుందని జ్యోతిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని