
బాలు - మహాలక్ష్మిల ప్రేమకు పదేళ్లు
ఇంటర్నెట్ డెస్క్: నాగచైతన్య, తమన్నా కలిసి జంటగా నటించిన చిత్రం ‘100% లవ్’. సుకుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరపైకి వచ్చి సందడి చేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు. ఈ సినిమా ఏప్రిల్ 6, 2011లో విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు పూర్తి చేసుకుంది. ప్రేక్షకుల అభిమానంతో పాటు సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా పొందింది. వాణిజ్యపరంగా బాక్సాఫీసు దగ్గర ఘన విజయం సాధించి, 2011లో విడుదలైన సినిమాల్లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
దేవిశ్రీ ప్రసాద్ సమకూర్చిన సంగీత స్వరాలు సినిమాకే హైలెట్‌గా నిలిచాయి. ‘కళ్ళు కళ్ళు ప్లస్సు..’’, ‘ఏ స్క్వేర్ బీ స్క్వేర్’, ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’, ‘డియ్యాలో డియ్యాలో’లాంటి ఐటెమ్ గీతంతో సంగీత ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం మలయాళంలో ఇదే పేరుతో డబ్బింగ్ అయ్యింది. ఇక బెంగాలీలో ‘ప్రేమ్ కి బుజిని’, తమిళంలో ‘100% కాదల్’గా రీమేక్ అయి సందడి చేసింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.