Chiranjeevi: నేను సక్సెస్‌ఫుల్‌ హీరో కావడానికి ఆమే కారణం: చిరంజీవి

తాను విజయవంతమైన హీరోగా ఉండటానికి ప్రధాన కారణం తన సతీమణి సురేఖ అని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు.

Updated : 22 Mar 2022 17:11 IST

హైదరాబాద్‌: తాను విజయవంతమైన హీరోగా ఉండటానికి ప్రధాన కారణం తన సతీమణి సురేఖ అని ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అన్నారు. తన సినిమాలపై వందశాతం దృష్టి పెట్టడానికి ఆమె సహకారం ఎంతో ఉందని చెప్పారు. మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌లో సంబరాలు నిర్వహించారు. సినీ పరిశ్రమలోని పలువురు మహిళా కార్మికులకు చిరంజీవి దంపతులు సన్మానం చేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడారు.

కుటుంబంలో మహిళకు ఎన్నో బాధ్యతలు ఉంటాయని.. చిన్నతనంలో తన తల్లి ఎంతో కష్టపడేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. నేటి మహిళలు చంద్రమండలం, ఒలింపిక్స్‌ స్థాయికి ఎదుగుతున్నారని చెప్పారు. మహిళా సాధికారత కోసం అందరూ కృషి చేయాలన్నారు. ప్రతి ఇంట్లో అమ్మ, సోదరి సాధికారత కోసం పాటుపడాలన్నారు. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి ఉండాలని చిరంజీవి ఆకాంక్షించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు