Chiranjeevi: చిరంజీవి - హరీశ్ శంకర్‌ల కాంబోలో సినిమా!

చిరంజీవి-హరీశ్‌ శంకర్‌ల కాంబోలో ఓ సినిమా రానున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Published : 01 Feb 2024 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పద్మవిభూషణ్‌ పురస్కారం అగ్ర కథానాయకుడు చిరంజీవికి ఈ ఏడాది కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఇప్పుడు అదే జోష్‌తో ఆయన వరుస సినిమాలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే తన 156వ సినిమా ‘విశ్వంభర’ పనుల్లో బిజీగా ఉన్న చిరు, ఇప్పుడు ఓ కొత్త ప్రాజెక్ట్‌ చేయనున్నారన్న వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇండస్ట్రీకి ‘గబ్బర్‌ సింగ్‌’ వంటి సూపర్‌ హిట్‌ను అందించిన హరీశ్ శంకర్‌ దర్శకత్వంతో ఆయన ఓ ప్రాజెక్ట్‌ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దీన్ని నిర్మించనుందని.. దీనికి సహ నిర్మాతగా సుస్మిత వ్యవహరించనున్నారని టాక్‌. బీవీఎస్‌ రవి దీనికి కథను అందించనున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌కు చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఎక్స్‌లో వీళ్లిద్దరి హ్యాష్‌ట్యాగ్‌లే ట్రెండ్‌ అవుతున్నాయి.  చిరంజీవి అంటే తనకెంతో ఇష్టమని హరీశ్ ఎన్నో సందర్భాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.

రూ.165 కోట్ల ఇంటిని వీడిన ప్రియాంక దంపతులు.. కారణం ఏమిటంటే?

ప్రస్తుతం చిరంజీవి ‘బింబిసార’ ఫేమ్‌ వశిష్ఠ దర్శకత్వంలో ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన దీని ప్రచార చిత్రానికి మంచి స్పందన వచ్చింది. చిరు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు హరీశ్‌ శంకర్‌ కూడా  ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh) పనుల్లో ఉన్నారు. పవన్ కల్యాణ్ హీరోగా రానున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయిక. ఈ చిత్రంతో పాటు రవితేజతో ‘మిస్టర్‌ బచ్చన్‌’ రూపొందిస్తున్నారు. దీని చిత్రీకరణ ప్రస్తుతం కరైకుడిలో జరుగుతోంది. రవితేజపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ రెండింటి తర్వాత చిరుతో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని