Citadel: సమంత, వరుణ్‌ధావన్‌ ‘సిటడెల్‌’ ఇండియన్‌ సిరీస్‌ టైటిల్‌ ఇదే!

Citadel Honey Bunny: సమంత, వరుణ్‌ధావన్‌ కలిసి నటించిన ‘సిటడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌ టైటిల్‌ను ప్రకటించారు.

Published : 19 Mar 2024 15:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుణ్‌ధావన్‌ (Varun Dhawan), సమంత (Samantha) జంటగా నటిస్తోన్న యాక్షన్‌ థ్రిల్లింగ్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటాడెల్‌’ (Citadel). రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సిరీస్‌కు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ముంబయి వేదికగా ప్రైమ్‌ వీడియో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ సిరీస్‌ టైటిల్‌ను ప్రకటించారు. దీనికి ‘సిటడెల్‌: హనీ-బన్నీ’ (Citadel: Honey Bunny)ని ఖరారు చేశారు. అయితే, ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు.

రాజ్‌, డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌లో కేకే మేనన్‌, సిమ్రన్‌, సోహమ్‌ మజుందార్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ‘ఫ్యామిలీ మ్యాన్‌2’లో నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో అదరగొట్టిన సమంత ‘సిటాడెల్‌’ కోసం ప్రత్యేకంగా సిద్ధమైంది. మార్షల్‌ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ముఖ్యంగా వరుణ్‌, సామ్‌ కలిసి చేసే యాక్షన్‌ సన్నివేశాలు అలరిస్తాయని టాక్‌. 1990ల నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగుతోందని తెలుస్తోంది. ఎలాంటి డూప్‌ లేకుండా ఆమె స్వయంగా యాక్షన్‌ సీక్వెన్స్‌ను పూర్తి చేశారట. రుస్సో బ్రదర్స్‌ నిర్మిస్తున్న ఈ సిరీస్‌ పలు దేశాల్లో, వివిధ భాషల్లో రూపొందుతోంది. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని