తెలుగు తెర‌పైకి మ‌రో పెళ్లిగీతం..

తెలుగు చిత్రాల్లో పెళ్లి పాట‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఇప్ప‌టికే ఎన్నో పెళ్లి గీతాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోగా తాజాగా మ‌రో గీతం సంద‌డి చేస్తోంది. అదే ‘వివాహ భోజ‌నంబు’ చిత్రంలోని ‘దేవీ కల్యాణ వైభోగ‌మే’.

Published : 20 May 2021 16:05 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: తెలుగు చిత్రాల్లో పెళ్లి పాట‌ల‌కు ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. ఇప్ప‌టికే ఎన్నో పెళ్లి గీతాలు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోగా తాజాగా మ‌రో గీతం సంద‌డి చేస్తోంది. అదే ‘వివాహ భోజ‌నంబు’ చిత్రంలోని ‘దేవీ కల్యాణ వైభోగ‌మే’. హాస్య న‌టుడు స‌త్య హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్ర‌మిది. అర్జావీరాజ్ నాయిక‌. సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఈ పాట‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. కిట్టు విస్సాప్ర‌గ‌డ సాహిత్యం అందించిన ఈ పాట‌ని ఆంటోనీ దాస‌న్‌, చిన్మయి ఆల‌పించారు. అనివీ సంగీతం అందించారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో పెళ్లి చేసుకున్న ఓ యువ‌కుడి క‌థ ఇది. రామ్ అబ్బ‌రాజు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ స్వీయ నిర్మాణంలో అతిథి పాత్ర పోషించారు. ఈ చిత్రంలో శ్రీకాంత్ అయ్యంగార్‌, వైవా హ‌ర్ష త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఆల‌స్య‌మెందుకు సత్య‌, అర్జావీ వివాహ వేడుక‌ని మీరూ తిల‌కించండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని