Dhee: కళ్లు తిప్పుకోనివ్వని మహేశ్‌ ‘కళావతి’.. చిరు, పవన్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తే!

చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తే చూడాలనుందా? వీరిద్దరు కాదుగానీ చిరు, పవన్‌ను పోలిన ఇద్దరు కంటెస్టెంట్‌లు కలిసి సందడి చేశారు. మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’లోని కళావతి పాటకు క్యాచీ స్టెప్పులేసి మరో ఇద్దరు డ్యాన్సర్లు వావ్‌ అనిపించారు.

Published : 07 May 2022 14:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి, పవన్‌కల్యాణ్‌ కలిసి డ్యాన్స్‌ చేస్తే చూడాలనుకుంటున్నారా? వీరిద్దరూ కాదుగానీ చిరు, పవన్‌ను పోలిన ఇద్దరు కంటెస్టెంట్‌లు కలిసి ఆ సందడిని తీసుకొచ్చారు. మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’లోని కళావతి పాటకు క్యాచీ స్టెప్పులేసి మరో ఇద్దరు డ్యాన్సర్లు వావ్‌ అనిపించారు. ఈ హంగామా జరిగింది ఎక్కడో కాదు రియాలిటీ డ్యాన్స్‌ షో ‘ఢీ 14’ వేదికపై. ఇక్కడ ప్రదర్శితమైన ‘కళావతి’ సాంగ్‌ కళ్లు తిప్పుకోనివ్వలేదు. నృత్యం అంత అద్భుతంగా, చాలా సింపుల్‌గా నయనానందకరంగా సాగింది. ఈ పాటకు పెర్ఫామ్‌ చేసిన వారితో టీమ్‌ లీడర్లు రవికృష్ణ, నవ్యస్వామి కలిసి పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు. వీరి ప్రతిభకు విజిల్‌ వేయడం న్యాయ నిర్ణేతల్లో ఒకరైన గణేశ్‌ మాస్టర్‌ వంతైంది.

మరోవైపు, పవన్‌కల్యాణ్‌, చిరంజీవిని తలపించేలా ఇద్దరు పార్టిసిపెంట్స్‌ మధ్య సాగిన సంభాషణ చూడ ముచ్చటగా ఉంది. చిరంజీవి డూప్‌ ‘ఠాగూర్’లోని చిన్నగ చిన్నగ పాటకు డ్యాన్స్‌ చేసిన అనంతరం పవన్‌ కల్యాణ్‌ డూప్‌ ఎంట్రీ ఇవ్వడం, ‘నీతో కలిసి డ్యాన్స్‌ చేయాలన్నది ఈమె కోరిక’ అంటూ చిరు డూప్‌ పవన్‌కు చెప్పడం.. ఇలా ప్రతిదీ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. మరి చిరు, పవన్‌ కలిసి డ్యాన్స్‌ చేశారా, లేదా? అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. వచ్చే బుధవారం రాత్రి 9.30 గం.లకు (ఈటీవీలో) ప్రసారంకానున్న ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలై సందడి చేస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని