వివాహానికి ముందు రూల్‌ పెట్టుకున్నాం: ప్రియాంక

వివాహానికి ముందు నిక్‌జొనాస్‌కి తనకి మధ్య ఓ ఒప్పందం ఉందని నటి ప్రియాంక చోప్రా తెలిపారు. గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి హాలీవుడ్‌ గాయకుడు నిక్‌జొనాస్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట...

Published : 05 Feb 2021 13:42 IST

భర్తతో ఉన్న ఒప్పందం బయటపెట్టిన నటి

ముంబయి: వివాహానికి ముందు నిక్‌జొనాస్‌కి తనకి మధ్య ఓ ఒప్పందం ఉందని నటి ప్రియాంక చోప్రా తెలిపారు. గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి హాలీవుడ్‌ గాయకుడు నిక్‌జొనాస్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్‌ ఏంజెల్స్‌లో నివాసముంటోంది. ఇక, పెళ్లి తర్వాత కూడా విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రియాంక తాజాగా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్‌జొనాస్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

‘వివాహానికి ముందు వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నేనైతే ఇటు భారత్‌తోపాటు అటు విదేశాల్లో కూడా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మేమిద్దరం ఓ నియమం పెట్టుకున్నాం. అదేమిటంటే.. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నాసరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకు ఒకసారి మేమిద్దరం కలవాలి. మాకు మేము సమయం కేటాయించుకోవాలి. సమన్వయంతో ప్రతి పనిని పూర్తి చేయాలి. ఇలా మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుని మా బంధాన్ని ఏడడుగుల వైపు వచ్చేలా చేశాం’ అని నటి ప్రియాంక వివరించారు.

ఇదీ చదవండి

టాలీవుడ్‌లో బీటౌన్‌ లేడీస్‌ ‘కీ’ రోల్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని