Sudha Kongara: సుధా కొంగరకు గాయం.. షూటింగ్‌కు నెలరోజులు దూరం

ప్రముఖ దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara) గాయపడ్డారు. చేతికి కట్టుతో ఉన్న ఫొటోలను ట్విటర్‌లో షేర్‌ చేశారు.  

Published : 05 Feb 2023 15:37 IST

చెన్నై: దర్శకురాలు సుధా కొంగర(Sudha Kongara) గాయపడ్డారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా అభిమానులకు తెలియచేశారు.‘ఆకాశమే నీ హద్దురా’(Soorarai Pottru) సినిమాతో దర్శకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు సుధా కొంగర. సూర్య(Surya) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి ఆమె ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పింది. తాజాగా ఆమె గాయపడ్డారు. చేతికట్టుతో ఉన్న ఫొటోలను షేర్‌ చేసిన సుధా.. చాలా చిరాకుగా, బాధగా ఉందని తెలిపారు. దెబ్బ కారణంగా నెలరోజులు షూటింగ్‌ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. తాను ఇలా షూటింగ్‌ నుంచి బ్రేక్‌ తీసుకోవల్సి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఈ విషయం తెలిసిన నెటిజన్లు, సినీ ప్రముఖులు ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.

ప్రస్తుతం సుధా బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌(Akshay Kumar)తో ఓ సినిమా చేస్తున్నారు. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదలైన సినిమాను హిందీలో తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఆమె ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌ టాటా బయోపిక్ తెరకెక్కించనున్నారని ఇటీవల పలు వార్తలు వచ్చాయి. వాటిపై ఆమె స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఆయన బయోపిక్‌ తెరకెక్కించే ఆలోచన లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని