Teja: చిత్ర పరిశ్రమ శాశ్వతం.. ఎవరున్నా లేకపోయినా నడుస్తుంది: దర్శకుడు తేజ

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవల ‘ఇండస్ట్రీ పెద్ద’ అనే అంశం హాట్‌ టాపిక్‌ మారింది. ఇప్పటికే ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించగా దర్శకుడు తేజ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Published : 10 Jan 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇటీవల ‘ఇండస్ట్రీ పెద్ద’ అనే అంశం హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికే ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు స్పందించగా.. దర్శకుడు తేజ ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు ఇండస్ట్రీ పెద్దగా ఉన్నప్పుడు బాగుండేదని, ఇప్పుడాయన లేని లోటు కనిపిస్తోందన్నారు.

‘కరోనా/లాక్‌డౌన్‌ సమయంలో దాసరి నారాయణరావుగారి లాంటి వారు ఉంటే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపేవారు. అన్నీ ఓ పద్ధతిలో సాగేవి. ఆయనో సింహం. దాసరిగారు లేకపోవటం ఇండస్ట్రీకి పెద్ద లోటు. ఆయన దగ్గరకు వెళ్లి లైట్‌బాయ్‌ కూడా తన సమస్యను చెప్పుకునేవాడు. దాసరిగారు అవసరమైతే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రితోనూ మాట్లాడేవారు. ‘ఫలానా వారు ఇండస్ట్రీ పెద్ద అయితే బాగుండు’ అని నేను అనుకుంటే సరిపోదు. ఇండస్ట్రీ మొత్తం అంగీకరించే వ్యక్తి కావాలి. ఎన్టీ రామారావు, ఎస్వీ రంగారావుగారి కాలం నుంచి చిత్ర పరిశ్రమను చూస్తున్నా. ఎవరున్నా లేకపోయినా ఇండస్ట్రీ నడుస్తుంది. ఇది శాశ్వతం. మధ్యలో వచ్చిన చాలామంది ‘నేను లేకపోతే ఇండస్ట్రీ లేదు. నా వల్లే ఇండస్ట్రీ ముందుకెళ్తోంది’ అనుకుంటుంటారు’’ అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని