Naga Chaitanya: నాగచైతన్యతో నేను టచ్‌లో లేను.. ‘మజిలీ’ నటి
‘మైఖేల్’ (Michael) ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి దివ్యాన్ష కౌశిక్ (Divyansha Kaushik). పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు.
హైదరాబాద్: ‘మజిలీ’ (Majili)తో తెలుగువారికి పరిచయమైన ఉత్తరాఖండ్ బ్యూటీ దివ్యాన్ష కౌశిక్ (Divyansha Kaushik). ఈ సినిమాలో నాగచైతన్యకు ప్రియురాలిగా నటించారు. ఈ క్రమంలోనే చైతన్యతో ఆమె రిలేషన్‌లో ఉందని, త్వరలోనే పెళ్లి అంటూ గతేడాది వార్తలు వచ్చాయి. వీటిపై తాజాగా ఆమె స్పందించారు. ‘‘నాగచైతన్య అంటే నాకెంతో ఇష్టం. నా సీనియర్‌గా భావిస్తాను. వృత్తిపరంగా ఆయనను స్ఫూర్తిగా తీసుకుంటాను. మా ఇద్దరి గురించి అలాంటి రూమర్స్ నేను వినలేదు. ఈ మధ్యకాలంలో మేమిద్దరం మాట్లాడుకున్నది కూడా లేదు’’ అని ఆమె వివరించారు.
అనంతరం తన సెలబ్రిటీ క్రష్ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అంటే ఎంతో ఇష్టం. ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) చూసి ఆయనపై క్రష్ ఏర్పడింది. అయితే ఈ మధ్యకాలంలో అమ్మాయిలందరూ ఆయన్నే ఇష్టపడుతున్నారు. దాంతో నా మనసు మార్చుకున్నాను. ఇప్పుడు నా క్రష్ ఆదిత్య రాయ్ కపూర్’’ అని చెప్పారు.
కెరీర్ విషయానికి వస్తే.. ‘మజిలీ’ తర్వాత దివ్యాన్ష ‘ది వైఫ్’, ‘రామారావు ఆన్ డ్యూటీ’ కోసం వర్క్ చేశారు. ఆ రెండూ మిశ్రమ స్పందనలకే పరిమితమయ్యాయి. ప్రస్తుతం ఈ బ్యూటీ సందీప్ కిషన్‌కు జోడీగా ‘మైఖేల్’లో నటించారు. ఫిబ్రవరి నెలలో ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Prince Harry: ప్రిన్స్ హ్యారీకి అమెరికా ‘బహిష్కరణ’ ముప్పు..!
-
India News
Amritpal Singh: అరెస్టైనవారికి సాయం చేస్తాం: అకాలీదళ్
-
Movies News
Social Look: శోభిత కాఫీ కథ.. సిమ్రత్ సెల్ఫీ.. మృణాళ్ విషెస్
-
Movies News
Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
-
Politics News
Karnataka: మళ్లీ నేనే సీఎం అన్న బొమ్మై.. కలలు కనొద్దంటూ కాంగ్రెస్ కామెంట్!
-
World News
Russia: పుతిన్‌పై విమర్శలు గుప్పించిన రష్యన్ ‘పాప్‌స్టార్’ మృతి