Ave Kallu: సూపర్‌స్టార్ కృష్ణ ‘అవేకళ్లు’.. 55 ఏళ్లు
కృష్ణ, కాంచన కీలక పాత్రల్లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ ‘అవేకళ్లు’. ఈ సినిమా విడుదలై ఈ డిసెంబరు 14వ తేదీకి 55ఏళ్లు పూర్తి చేసుకుంది.
ఇంటర్నెట్‌డెస్క్: క్రైమ్, థ్రిల్లర్. ఇప్పుడు ఏ చిత్ర పరిశ్రమలో చూసినా ఈ జోనర్ హవా నడుస్తోంది. వరుసగా హత్యలు జరగడం వాటిని కథానాయకుడు ఛేదించడం. పాయింట్ పాతదే అయినా, కథనాన్ని నడిపించడంలో ఏ కాస్త జాగ్రత్తలు తీసుకున్నా, సినిమా హిట్టయినట్టే. అలాంటి సినిమాలో దివంగత నటుడు సూపర్‌స్టార్ కృష్ణ (krishna) 55ఏళ్ల కిందటే నటించారు. అదే ‘అవేకళ్లు’ (ave kallu). ఏవీఎం సంస్థ నిర్మించింది. త్రిలోక్ చందర్ దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం డిసెంబరు 14, 1967లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. కాంచన, గుమ్మడి, రాజనాల, పద్మనాభం, రమణారెడ్డి, నాగభూషణం, గీతాంజలి ప్రముఖ పాత్రల్లో నటించారు.
అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా అత్యున్నత ప్రమాణాలతో తీసిన ‘అవే కళ్లు’ నేటికీ తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది. తెలుగులో కలర్‌లో వచ్చిన మొదటి సోషల్ సినిమా ‘తేనె మనసులు’ కాగా, పూర్తి కలర్‌లో వచ్చిన మొదటి క్రైమ్ చిత్రం ‘అవే కళ్లు’. సంగీత పరంగా కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ‘మా ఊళ్ళో ఒక పడుచుంది...దెయ్యమంటే భయమన్నది...’ వంటి పాటలు విశేష ఆదరణ పొందాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Venkatesh: ఇప్పుడు టర్న్ తీసుకున్నా.. ‘రానా నాయుడు’పై వెంకటేశ్ కామెంట్
-
Sports News
IPL:ఆటగాళ్ల పనిభార నిర్వహణ.. అవసరమైతే ఐపీఎల్లో ఆడటం మానేయండి: రవిశాస్త్రి
-
General News
Hyderabad : విద్యుత్ ఉద్యోగుల మహా ధర్నా.. ఖైరతాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
-
India News
Rahul Gandhi: జైలు శిక్ష తీర్పు తర్వాత.. లోక్‌సభకు రాహుల్ గాంధీ
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TSPSC paper leak case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో 19 మందిని సాక్షులుగా చేర్చిన సిట్..