Baby movie: ‘బేబీ’కి యువత ఫిదా.. సోషల్‌మీడియాలో ఫన్నీ మీమ్స్‌ వరద..!

Baby movie: తాజాగా విడుదలైన ‘బేబీ’ మూవీ యువతను విశేషంగా అలరిస్తోంది. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాల వేదికగా మీమ్స్‌ వైరల్ అవుతున్నాయి.

Published : 16 Jul 2023 10:50 IST

హైదరాబాద్‌: ఆనంద్ దేవ‌ర‌కొండ‌ (Anand Deverakonda), వైష్ణ‌వి చైత‌న్య‌ (Vaishnavi Chaitanya), విరాజ్ అశ్విన్‌ కీలక పాత్రల్లో సాయి రాజేశ్‌ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘బేబీ’ (Baby). ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ‘మొదటి ప్రేమకి మరణం లేదు. మనసు పొరల్లో శాశ్వతంగా సమాధి చేయబడి ఉంటుంది’ అంటూ రూపొందిన ఈ మూవీ యువతకు బాగా కనెక్ట్‌ అయ్యింది. ఆనంద్‌, వైష్ణవిలు తమ నటనతో అలరించారు. యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి తన నటనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో మీమ్స్‌ వైరల్‌ అవుతున్నాయి. సినిమాను కథకు సూటయ్యేలా పాత సినిమాల్లోని సన్నివేశాలను రీమిక్స్‌ చేసి పంచుకున్న వీడియోలు అలరిస్తున్నాయి. ఉపేంద్ర హీరోగా నటించిన ఓ సినిమాలోని సీన్‌ కడుపుబ్బా నవిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫన్నీ మీమ్స్‌, వీడియోలు మీరూ చూసేయండి.














Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని