Manjima Mohan: మంజిమా మోహన్‌తో ‘కడలి’ హీరో ప్రేమాయణం..!
మణిరత్నం ‘కడలి’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన యువ కథానాయకుడు గౌతమ్ కార్తిక్, కథానాయిక మంజిమా మోహన్ తమ రిలేషన్ గురించి ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు.
చెన్నై: మణిరత్నం ‘కడలి’ చిత్రంతో వెండితెరకు పరిచయమైన యువ కథానాయకుడు గౌతమ్ కార్తిక్. తమిళంలో వరుస చిత్రాలు చేస్తున్న కార్తిక్, కథానాయిక మంజిమా మోహన్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. ఇద్దరూ కలిసున్న ఫొటోలను పంచుకున్న కార్తిక్ తమ ప్రేమ గురించి ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్‌పెట్టాడు. మంజిమా తెలుగులో నాగచైతన్యతో కలిసి ‘సాహసమే శ్వాసగా’లో నటించింది.
‘‘మా మధ్య ఉన్న బంధాన్ని వర్ణించడానికి ‘ప్రేమ’ అనే పదం కూడా సరిపోదేమో. నువ్వు నా పక్కన ఉంటే జీవితంలో దేనినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం. నీతో ఈ అనుబంధాన్ని కలిగి ఉండటం నిజంగా నాకెంతో సంతోషం. నీ నుంచి ప్రతినిత్యం కడదాకా ప్రేమను పొందనివ్వు. మన ప్రయాణం ఒక్కటిగా మొదలు పెట్టేందుకు ఇక వేచి చూడలేను’’ అని పేర్కొన్నాడు. మూడేళ్ల కిందట కార్తిక్ తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన ఆలోచన దృక్కోణం పూర్తిగా మారిపోయినట్లు మంజిమా తెలిపింది. అతడితో ఉండటం తనకు కలిగిన భాగ్యమని చెప్పింది. ప్రస్తుతం ఈ న్యూస్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
దంపతులను కారుతో ఢీ కొట్టిన నటుడు.. మహిళ మృతి
-
IAF: వాయుసేన హెలికాప్టర్లో సాంకేతిక లోపం.. పొలాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
-
KTR: బాల్క సుమన్ మంత్రి అయితే అద్భుతాలు చేస్తారు: కేటీఆర్
-
Turkey: తుర్కియే పార్లమెంట్ వద్ద ఆత్మాహుతి దాడి
-
Anirudh: ఆ సమయంలో నేనెంతో బాధపడ్డా: అనిరుధ్
-
Chatrapati Shivaji: 350 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరనున్న ఛత్రపతి శివాజీ ఆయుధం