క్షమాపణలు కోరితే చిన్మయికి చోటు

గాయని చిన్మయి క్షమాపణలు కోరితే ఆమెను డబ్బింగ్‌ కళాకారుల సంఘంలో చేర్చుకుంటామని ఆ సంఘం అధ్యక్షుడు రాధారవి తెలిపారు. ఈ సంఘానికి సంబంధించిన ఎన్నికలు శనివారం కోయంబేడు మార్గంలోని ఏకేఆర్‌ కల్యాణమండపంలో

Updated : 16 Feb 2020 09:10 IST

రాధారవి

రాధారవి

కోడంబాక్కం: గాయని చిన్మయి క్షమాపణలు కోరితే ఆమెను డబ్బింగ్‌ కళాకారుల సంఘంలో చేర్చుకుంటామని ఆ సంఘం అధ్యక్షుడు రాధారవి తెలిపారు. ఈ సంఘానికి సంబంధించిన ఎన్నికలు శనివారం కోయంబేడు మార్గంలోని ఏకేఆర్‌ కల్యాణమండపంలో జరిగాయి. అధ్యక్ష పదవికి రాధారవితోపాటు చిన్మయి కూడా నామపత్రం దాఖలు చేశారు. అయితే చిన్మయి నామినేషన్‌ కొన్ని కారణాల వల్ల తిరస్కరణకు గురైంది. దీంతో అధ్యక్ష పదవికి రాధారవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, కార్యవర్గ సభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 1300 మంది సభ్యులున్నట్లు సమాచారం. ఎన్నికల సందర్భంగా రాధారవి మాట్లాడుతూ.. చిన్మయి క్షమాపణలు చెబితే ఆమెను మళ్లీ సంఘంలోకి తీసుకుంటామని చెప్పారు. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. రాధారవికి ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమాపణలు చెప్పనని తేల్చి చెప్పారు. ఆ అవసరం తనకు లేదని బదులిచ్చారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని