భూగోళమే పెంచే వేగమే.. నిన్ను నన్ను కలిపేందుకే

‘‘ఆకాశమే తలే ఎత్తెనే.. నా ప్రేమ కొలిచేందుకే. భూగోళమే పెంచే వేగమే.. నిన్ను నన్ను కలిపేందుకే’’ అంటూ ప్రేమ పాటలు పాడుకుంటున్నారు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా సంతోష్‌ జాగర్లపూడి తెరకెక్కించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. నారాయణ్‌ దాస్‌.కె నారంగ్‌,

Published : 05 Dec 2021 03:05 IST

‘‘ఆకాశమే తలే ఎత్తెనే.. నా ప్రేమ కొలిచేందుకే. భూగోళమే పెంచే వేగమే.. నిన్ను నన్ను కలిపేందుకే’’ అంటూ ప్రేమ పాటలు పాడుకుంటున్నారు నాగశౌర్య. ఆయన కథానాయకుడిగా సంతోష్‌ జాగర్లపూడి తెరకెక్కించిన క్రీడా నేపథ్య చిత్రం ‘లక్ష్య’. నారాయణ్‌ దాస్‌.కె నారంగ్‌, పుస్కర్‌ రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మించారు. కేతిక శర్మ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 10న   విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్‌లో ‘‘సయా సయా..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు కాల భైరవ స్వరాలు సమకూర్చగా.. కృష్ణకాంత్‌ సాహిత్యమందించారు. జునైద్‌ కుమార్‌ ఆలపించారు. పాటలో శౌర్య, కేతికల జోడీ చూడముచ్చటగా కనిపించింది. ఈ సినిమాకి కూర్పు: జునైద్‌, ఛాయాగ్రహణం: రామ్‌ రెడ్డి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని